Begin typing your search above and press return to search.
#దళపతి 65.. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్!
By: Tupaki Desk | 22 Jan 2021 12:00 PM ISTఇలయదళపతి విజయ్ నటించిన 64వ సినిమా `మాస్టర్` తమిళంలో పెద్ద విజయం సాధించగా.. తెలుగులో సోసో అనిపించుకుంది. ఈ రిజల్ట్ అనంతరం .. విజయ్ తదుపరి సినిమాపై పూర్తిగా దృష్టి సారించారని తెలిసింది.
విజయ్ నటించే 65వ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కొన్ని నెలల క్రితం వచ్చింది. కొంత సస్పెన్స్ తరువాత.. డాక్టర్ ఫేం నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
నిజానికి ఆ కథను నెల్సన్ వేరొక హీరో కోసం రాసుకున్నది. తొలుత శివకార్తికేయన్ ను దృష్టిలో ఉంచుకుని దిలీప్ కుమార్ ఆ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. కానీ చివరి క్షణంలో ప్రణాళిక మారింది. సన్ పిక్చర్స్ బ్యానర్ అదే స్క్రిప్ట్ ను విజయ్ కు వివరించాలని నెల్సన్ ని కోరిందట. స్క్రిప్ట్ విన్న వెంటనే విజయ్ ప్రాజెక్ట్ చేయటానికి సరే అని చెప్పాడు. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యులర్ చిత్రీకరణకు సిద్ధమవుతోంది.