Begin typing your search above and press return to search.

విజయ్ - రష్మిక కలిసే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారా..?

By:  Tupaki Desk   |   6 Jan 2022 7:30 AM GMT
విజయ్ - రష్మిక కలిసే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారా..?
X
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా జోడీకి సినీ అభిమానుల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'గీత గోవిందం' సినిమాలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో అలరించిన ఈ జంట.. 'డియర్ కామ్రెడ్' మూవీలో మరోసారి అద్భుతమైన కెమిస్ట్రీని పండించారు. అలానే ఇద్దరూ కలిసి పలు కమర్షియల్ యాడ్స్ కూడా చేసారు.

వెండితెర మీద ఫర్ఫెక్ట్ జోడీ అనిపించుకున్న విజయ్ - రష్మిక.. నిజ జీవితంలోనూ రిలేషన్ షిప్ లో ఉన్నారని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. ప్రస్తుతం వీరిద్దరూ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరి సినిమాల షూటింగ్స్ ముంబై లోనే జరుగుతుండటంతో వీలైనప్పుడల్లా కలుసుకోవడంతో రూమర్స్ మళ్ళీ తెర మీదకు వచ్చాయి.

కన్నడ హీరో రక్షిత్ శెట్టితో కొన్నాళ్ళు ప్రేమాయణం సాగించిన రష్మిక మందన్నా.. ఆ మధ్య ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత విజయ్ - రష్మిక రిలేషన్ షిప్ లో ఉన్నారనే గుసగుసలు వినిపించాయి. అయితే ఇవేవీ పట్టించుకోని ఈ క్రేజీ జంట.. ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా గడుపుతున్నారు.

2022 ప్రారంభంలో వీరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందనే పుకార్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. దీనికి కారణం విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడమే అని తెలుస్తోంది. కొత్త సంవత్సరం వేడుకల్లో ఇద్దరూ కలిసినట్లు ఎక్కడా వెల్లడించనప్పటికీ.. రష్మిక - విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌ లలో షేర్ చేసిన ఫోటోలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయని నెటిజన్స్ అంటున్నారు.

విజయ్ - ఆనంద్ - రష్మిక ఫోటోల బ్యాగ్రౌండ్ గమనిస్తే వీరు ముగ్గురూ ఒకే చోట ఉన్నారనే విషయం అర్థం అవుతుంది. బాలీవుడ్ ప్రేమ జంటలు విహారయాత్రలకు విదేశాలకు వెళ్ళినప్పుడు కలిసి వెళ్లారనే విషయం తెలియకుండా జాగ్రత్తలు పడుతుంటారు. ఇటీవల వివాహబంధంతో ఒకటైన లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ ఇలానే అనేక సందర్భాల్లో దొరికిపోయారు.

ఇప్పుడు విజయ్ దేవరకొండ - రష్మిక కూడా కెమెరా కళ్ళకు చిక్కకుండా అదే ట్రెండ్‌ ను అనుసరించినప్పటికీ.. వారు కలిసి న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకున్నారని ఇంస్టాగ్రామ్ ఫోటోలు సూచించాయి. ఇదే పుకార్లకు ఊతం ఇచ్చింది. అయితే ఇద్దరు హీరోహీరోయిన్లు కలిసి హాలిడేకి వెళ్లినంత మాత్రాన వారి మధ్య ఏదో ఉందని అనుకోవడం పొరపాటని.. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు కాకూడదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే విజయ్ - రష్మిక ఇద్దరూ ఇప్పుడు బాలీవుడ్ లో సాలిడ్ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. VD 'లైగర్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇటీవలే విడుదలైన గ్లిమ్స్ నార్త్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక 'మిష‌న్ మ‌జ్ను' సినిమాతో ర‌ష్మిక హిందీలోకి అడుగుపెడుతోంది. మరి త్వరలోనే వీరిద్దరూ కలిసి సినిమా చేసి, మరోసారి ఆడియన్స్ ని అలరిస్తారేమో చూడాలి.