Begin typing your search above and press return to search.

ఇంకా రెచ్చి పోతున్న నటి.. దిష్టి బొమ్మ దగ్దం!

By:  Tupaki Desk   |   20 Aug 2020 6:45 AM GMT
ఇంకా రెచ్చి పోతున్న నటి.. దిష్టి బొమ్మ దగ్దం!
X
తమిళ స్టార్స్‌ పై గత కొన్ని రోజులుగా మీరా మిథున్‌ చేస్తున్న విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. పబ్లిసిటీ కోసమో లేక మరేంటో కాని మీరా మరీ రెచ్చి పోయి వ్యాఖ్యలు చేస్తోంది. ఇప్పటికే ఆమెను భారతిరాజా వంటి ప్రముఖులు హెచ్చరించారు. రజినీకాంత్‌.. విజయ్‌.. సూర్య వంటి స్టార్స్‌ ను టార్గెట్‌ చేసిన విమర్శలు చేసిన మీరా మిథున్‌ ఆమద్య విశాల్‌ ను గురించి కూడా కామెంట్స్‌ చేసింది. మీరా మిధున్‌ మాజీ మేనేజర్‌ ఒక వీడియోను విడుదల చేశాడు. అందులో విశాల్‌ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఆయన రెండు మూడు సంవత్సరాలుగా నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. కాని నాకు మాత్రం డబ్బున్న వారిని పెళ్లి చేసుకోవాలని లేదు అంటూ ఆ వీడియోలో మీరా చెప్పింది.

స్టార్స్‌ పై మీరా మిధున్‌ వ్యాఖ్యలు చేయడంను నెటిజన్స్‌ తీవ్రంగా తప్పుబడుతున్నారు. సోషల్‌ మీడియాలో ఇప్పటికే ఆమెను బండ బూతులు తిడుతూ ట్రోల్స్‌ చేస్తున్న వారు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఆమె దిష్టి బొమ్మను తగులబెట్టారు. చెన్నైలో విజయ్‌ మరియు సూర్య అభిమానులం అంటూ కలామ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో మీరా మిథున్‌ దిష్టి బొమ్మను తగులబెట్టారు. ఆ విజువల్స్‌ ప్రముఖ తమిళ మీడియాల్లో వచ్చాయి. ఈ విషయంతో ఆమె మరింత సీరియస్‌ అయ్యింది.

కలామ్‌ పేరుతో ఉన్న ఆర్గనైజేషన్‌ తో ఇలాంటి పనులు చేయడానికి బుద్ది లేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కనీసం మీరు ఆ పేరును అయినా మార్చుకోండి. కలామ్‌ జీ కి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా. ఇలాంటి పనులు చేస్తున్న మీకు ఆయన పేరు వాడుకునే అర్హత లేదు. ఈ ఘటనకు పూర్తిగా విజయ్‌ మరియు సూర్యలే కారణం అంటూ మీరా మళ్లీ విమర్శలు మొదలు పెట్టింది. ఇటీవల ఆమెకు కాల్‌ చేసి చంపేస్తామని బెదిరించారట. మీరా తన విమర్శలకు పదును పెడుతున్నా కొద్ది ఆమెను నెటిజన్స్‌ మరియు ఆయా హీరోల ఫ్యాన్స్‌ టార్గెట్‌ చేయడం ఎక్కువ అవుతుంది.