Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునేలా ట్వీట్‌ చేసిన హీరో

By:  Tupaki Desk   |   2 Feb 2023 2:10 PM GMT
ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునేలా ట్వీట్‌ చేసిన హీరో
X
కోలీవుడ్‌ లో సంగీత దర్శకుడిగా సక్సెస్ అయ్యి ఆ తర్వాత హీరోగా.. దర్శకుడిగా.. నిర్మాతగా కూడా పలు సినిమాలు చేసిన విజయ్ ఆంటోనీ ఇటీవల షూటింగ్‌ లో గాయ పడ్డ విషయం తెల్సిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఒకానొక సమయంలో మీడియాలో చాలా సీరియస్ గా ఉన్నాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి.

మీడియాలో పుకార్లకు విజయ్ ఆంటోని భార్య స్పందిస్తూ తన భర్త ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలో కోలుకుంటాడు అంటూ పేర్కొంది. దాంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు విజయ్ ఆంటోనీ థంబ్ ను చూపించి కోలుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

తాజాగా విజయ్ ఆంటోనీ నుండి మరో ట్వీట్‌ వచ్చింది. తాను 90 శాతం కోలుకున్నట్లుగా విజయ్‌ ఆంటోని పేర్కొన్నాడు. నా విరిగిన దవడ మరియు ముక్క ఎముకలు కలిసి పోయాయి.

నేను గతంతో పోల్చితే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను.. ఈ రోజు నుండే నేను బిచ్చగాడు 2 షూటింగ్‌ లో పాల్గొంటున్నాను అంటూ విజయ్ ఆంటోనీ తాజా ట్వీట్‌ లో పేర్కొన్నాడు.

విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు చాలా ఆందోళన వ్యక్తం చేశారు. చాలా నెలల తరబడి ఆయన బెడ్‌ కే పరిమితం అవ్వాల్సి ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. కానీ తాజాగా విజయ్ ఆంటోని చేసిన ట్వీట్ తో ఫ్యాన్స్ అంతా కూడా ఊపిరి పీల్చు కుంటున్నారు.

తెలుగు లో బిచ్చగాడు సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న విజయ్ ఆంటోనీ ప్రస్తుతం అదే సినిమాకు సీక్వెల్‌ చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ సందర్భంగానే విజయ్ ఆంటోనీకి గాయాలు అయ్యాయి. ఇప్పుడు ఆ గాయాల నుండి కోలుకుంటున్నాడు. తాజాగా బిచ్చగాడు 2 షూటింగ్ ప్రారంభం అవ్వడంతో ఏప్రిల్‌ నెలలో సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తమిళ మీడియా వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.