Begin typing your search above and press return to search.
ఇంద్రసేనతో మెప్పిస్తాం అంటున్నాడు
By: Tupaki Desk | 14 Oct 2017 5:42 AM GMTతమిళ నటుడు విజయ్ ఆంటోని బిచ్చగాడు మూవీతో తెలుగు ప్రేక్షకులందరికీ బాగానే నోట్ అయ్యాడు. ఆ సినిమా తెలుగులో సాధించిన ఘన విజయంతో స్టార్ హీరోల్లాగా తమిళంలో అతడు చేస్తున్న ప్రతి సినిమాను ఇక్కడ డబ్ చేయడం మొదలెట్టారు. బిచ్చగాడు తర్వాత వచ్చిన భేతాళుడు - యమన్ చిత్రాలు ఇక్కడి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.
తాజాగా సి.శ్రీనివాస్ దర్శకత్వంలో ఇంద్రసేన అనే చిత్రాన్ని చేస్తున్నాడు విజయ్ ఆంటోని. ఈ సినిమాని రాధిక శరత్ కుమార్ తో కలిసి విజయ్ ఆంటోనియే నిర్మిస్తున్నాడు. దీనికి సంగీత దర్శకుడు, ఎడిటర్ కూడా అతడే కావడం విశేషం. ఈ మూవీ ఆడియో రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశామని.. కచ్చితంగా అందరినీ మెప్పించేలా సినిమా తీశామని విజయ్ ఆంటోని చెబుతున్నాడు. ‘‘నా మొదటి సినిమా నుంచి మీరందరూ నన్ను ఆదరిస్తున్నారు. సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్స్ తో నిండి ఉన్న డిఫరెంట్ మూవీ ఇది. పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. డిసెంబర్ మొదటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఈసారి డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తా’’ అంటూ విజయ్ అంటోని ఇంద్రసేన విశేషాలు చెప్పుకొచ్చాడు.
తెలుగు ఇండస్ట్రీలో తన సక్సెస్ వెనుక ఈ మూవీ డబ్బింగ్ రైటర్ భాషాశ్రీ ఘనత ఎంతో ఉందని విజయ్ ఆంటోని కితాబిచ్చాడు. తన చివరి సినిమా వరకు ఆయనతో కలిసే పని చేస్తానని.. ఆఖరుకు తన డైరెక్ట్ తెలుగు మూవీలోనూ అందులోనూ ఆయన భాగస్వామ్యం తప్పక ఉంటుందన్నాడు. అన్నాదురై పేరిట తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాలో డయానా చంపిక, మహిమా హీరోయిన్లుగా నటించారు.