Begin typing your search above and press return to search.
‘బిచ్చగాడు’ మీద ఆరేడు రెట్లు పలికింది
By: Tupaki Desk | 29 Jun 2016 1:30 PM GMTఒకే ఒక్క సినిమా విజయ్ ఆంటోనీ రాతను మార్చేసింది. తెలుగులో అతడికి మాంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. మంచి మార్కెట్ కూడా క్రియేట్ చేసింది. ఆ సినిమా ‘బిచ్చగాడు’ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా డబ్బింగ్ హక్కుల్ని కేవలం రూ.30 లక్షలకు కొన్నాడు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. ఇంకో 20 లక్షలు ఖర్చు పెట్టి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ఇప్పుడా సినిమా రూ.20 కోట్ల దాకా వసూలు చేస్తోంది. ఈ సినిమాకు తమిళంలో నిర్మాత కూడా విజయ్ ఆంటోనీనే. మరీ తక్కువకు సినిమాను ఇచ్చేసి నష్టపోయానని ఫీలై ఉంటాడేమో అతను. ఐతే ‘బిచ్చగాడు’ వల్ల మార్కెట్ పెరిగి.. తన తర్వాతి సినిమాకు మాంచి ప్రైస్ దక్కుతున్నందుకు అతను చాలా సంతోషంగానే ఉండి ఉంటాడు.
‘బిచ్చగాడు’ సినిమాను రూ.30 లక్షలకే ఇచ్చిన విజయ్ ఆంటోనీ.. తన తర్వాతి సినిమా ‘సైతాన్’కు మాత్రం మంచి రేటు రాబట్టుకున్నాడు. ఎస్.వేణుగోపాల్ అనే డిస్ట్రిబ్యూటర్ రూ.2.05 కోట్లకు ‘సైతాన్’ ఏపీ-తెలంగాణ రైట్స్ సొంతం చేసుకున్నాడు. అంటే బిచ్చగాడు మీద ఆరేడు రెట్లు ఎక్కువ రేటు పలికిందన్నమాట ఈ సినిమా. ప్రదీప్ కృష్ణమూర్తి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ‘సైతాన్’ ఓ సైకలాజికల్ థ్రిల్లర్. విజయ్ ఆంటోనీ మరో వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నాడిందులో. అరుంధతి నాయర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా విజయ్ ఆంటోనీనే నిర్మిస్తుండటం విశేషం. జులై నెలాఖరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.