Begin typing your search above and press return to search.

సంక్రాంతి టైంలో దీపావళి శుభాకాంక్షలా?

By:  Tupaki Desk   |   19 Jan 2018 3:10 PM IST
సంక్రాంతి టైంలో దీపావళి శుభాకాంక్షలా?
X
తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ రోజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పాడు. సంక్రాంతి సీజన్లో దీపావళి శుభాకాంక్షలు ఏమిటబ్బా అని చాలామందికి అర్థం కాలేదు. కానీ ఆయన ట్వీట్ వెనుక మతలబు వేరే ఉంది. తన తర్వాతి సినిమా రిలీజ్ డేట్ ను పరోక్షంగా ఇలా వెల్లడించినట్లుగా భావిస్తున్నారు. మహేష్ బాబుతో ‘స్పైడర్’ లాంటి డిజాస్టర్ అందించిన మురుగదాస్.. ఈ ఫెయిల్యూర్ నుంచి బయటపడేందుకు వెంటనే ఒక సినిమా మొదలుపెట్టేస్తున్నాడు. ఇంతకుముందు ‘తుపాకి’.. ‘కత్తి’ లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన విజయ్ తో ఆయన సినిమా మొదలుపెడుతున్నాడు.

ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలైంది. ఈ చిత్రం ఎప్పుడు రిలీజవుతుందా అనే విషయంలో విజయ్ ఫ్యాన్స్ ఊహాగానాల్లో ఉండగా.. మురుగదాస్ తన ట్వీట్ ద్వారా స్పష్టత ఇచ్చేశాడు. దీపావళికి సినిమా రిలీజవుతుందని చెప్పకనే చెప్పేశాడు. ఇంతకుముందు ‘రోబో’ లాంటి మెగా మూవీ తీసి.. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్న సన్ పిక్చర్స్ మళ్లీ ఈ భారీ ప్రాజెక్టుతో రీఎంట్రీ ఇస్తోంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నాడు. ఇంతకుముందు విజయ్ తో ‘భైరవ’ అనే సినిమాలో జత కట్టిన కీర్తి సురేషే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. మరి ఈ సినిమాలో మురుగదాస్ మళ్లీ తన సత్తాను చాటుకుంటాడేమో చూద్దాం.