Begin typing your search above and press return to search.
రెండు పోస్టర్లతో రచ్చ చేసేశారు
By: Tupaki Desk | 23 Jun 2019 4:17 AM GMTఏదైనా సినిమాకు హైప్ తీసుకురావడంలో విడుదలకు ముందే రికార్డులతో హోరెత్తించడంలో తమిళ హీరోలు అభిమానులకు ఎవరూ పోటీ రారేమో. నువ్వు గొప్పా నేను గొప్పా అని స్టార్లు కొట్టుకోరు కానీ ఫ్యాన్స్ మాత్రం ఆన్ లైన్ వేదికగా నానా అరాచకం చేయడం కూడా అక్కడే చూస్తుంటాం. ముఖ్యంగా అజిత్ విజయ్ ఫాలోయర్స్ మధ్య ఈ మధ్య కాలంలో ఇది మరింత ముదిరిపోతోంది. తాజాగా విజయ్ బిగిల్ పోస్టర్లు రెండు రిలీజైన సంగతి తెలిసిందే. ఇం
తకు ముందు ఇదే హీరోతో తేరి-మెర్సల్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ సాధించిన అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తుండటం మరో ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పుడు వదలిన రెండు పోస్టర్లు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో ఒక ఫుట్ బాల్ ప్లేయర్ గా మరొకటి ఊర మాస్ స్టైల్ లో కత్తి పట్టిన లోకల్ గూండాగా విజయ్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ఇది డ్యూయల్ రోలా లేక ఒక వ్యక్తే అలా మారతాడా అనే సస్పెన్స్ ఇంకా వీడలేదు.
హీరో పాత్ర పేరు మైకేల్ అని మాత్రం రివీల్ చేశారు. మామూలుగానే విజయ్ సినిమాలు ఈజీగా వంద కోట్ల బిజినెస్ జరుపుకుంటాయి. కానీ ఈ పోస్టర్లు చూసాక అంతకు ముందు చెప్పిన మొత్తానికి ఇంకో నాలుగైదు కోట్లు అదనంగా ఇస్తామని బయ్యర్లు ముందుకు వస్తున్నారట. ఇది పక్కా విజయ్ మార్క్ మాస్ మసాలా చిత్రమనే క్లారిటీ రావడంతో ఎంత పెట్టి కొనేందుకైనా సిద్ధపడుతున్నారు. అక్కడ ఈ రేంజ్ లో హంగామా ఉంటే తెలుగు వెర్షన్ హక్కుల కోసం ఎవరూ పెద్దగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం