Begin typing your search above and press return to search.

'లైగర్' తో VD టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపు తీసుకొస్తాడా..?

By:  Tupaki Desk   |   29 July 2022 2:30 PM GMT
లైగర్ తో VD టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపు తీసుకొస్తాడా..?
X
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరియు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ''లైగర్''. ఇది పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో రాబోతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

'లైగర్' అనేది విజయ్ మరియు పూరీ లకు ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. పూరీ కనెక్ట్స్ మరియు బాలీవుడ్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై పూరీ - ఛార్మీ కౌర్ మరియు కరణ్ జోహార్ సంయుక్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'లైగర్' సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. సోషల్ మీడియాలో మంచి బజ్‌ ని క్రియేట్ చేయగలిగింది. ముఖ్యంగా ఇటీవల వచ్చిన ట్రైలర్ సినిమా క్రేజ్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది.

విజయ్ దేవరకొండ గత చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' ప్లాప్ అయినా.. 'ఇస్మార్ట్ శంకర్' తరువాత పూరీ జగన్నాధ్ తీసిన సినిమా కావడం.. ప్రస్తుతం 'లైగర్' పై నెలకొన్న హైప్ దృష్ట్యా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

కరణ్ జోహార్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ ఉన్నాడు కాబట్టి.. హిందీ మార్కెట్ లో 'లైగర్' గురించి ఆలోచించాల్సిన పనిలేదు. మిగతా నాలుగు దక్షిణాది భాషల రైట్స్ ని మాత్రం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను కొనుగోలు చేసారని తెలుస్తోంది. దీని కోసం దాదాపు 70 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నారని టాక్.

ఇకపోతే ఆంధ్రాలో వైజాగ్ ఏరియాను డైరెక్టర్ కొరటాల శివ సన్నిహితుడు సుధాకర్.. ఈస్ట్ గోదావరి ఏరియాను డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి ముఫై కోట్ల రేషియోలో తీసుకున్నారని సమాచారం.

దీన్ని బట్టి 'లైగర్' మూవీ మంచి రేట్లకే అమ్ముడు పోయిందని చెప్పొచ్చు. ఇది విజయ్ దేవరకొండ కెరీర్ లోనే హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా అని చెప్పాలి. కాకపోతే అంత మొత్తం రికవరీ చేస్తుందా లేదా అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇటీవల వరంగల్ శ్రీను 'ఆచార్య' చిత్రాన్ని అధిక రేట్లకు కొనుగోలు చేసి, భారీ నష్టాలను చవిచూశాడు. ఇప్పుడు 'లైగర్' సినిమాకి భారీ ధర చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. డిస్ట్రిబ్యూటర్ ఈసారైనా మంచి లాభాలు ఆర్జిస్తాడేమో చూడాలి.

పాండమిక్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. RRR వంటి పాన్ ఇండియా సినిమా మాత్రమే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఎక్కువ శాతం నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాలే ఉన్నాయి.

ఇక టైర్-2 హీరోల సినిమాలైతే నిర్మాతలకు నష్టాలనే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ 'లైగర్' చిత్రంతో బాక్సాఫీస్ కు ఊపు తీసుకొస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.