Begin typing your search above and press return to search.
సైకిల్ పై వచ్చి ఓటు వేసిన విజయ్.. దీని వెనుక ఉద్దేశ్యం అదేనా?
By: Tupaki Desk | 6 April 2021 6:00 AM GMTతమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్కడ అన్ని నియోజకవర్గాలకూ ఇవాళ ఒకే రోజున ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళ రాజకీయాలలో నటీనటులు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన ఇంటి నుంచి పోలింగ్ కేంద్రం వరకు సైకిల్ పై వచ్చి ఓటు వేయడం గమనార్హం. ప్రస్తుతం విజయ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా.. ఓటర్లలో చైతన్యం తీసుకురాడానికి విజయ్ ఇలా సైకిల్ పై వచ్చి ఓటు వేశారని అందరూ భావిస్తున్నారు. పరోక్షంగా బీజేపీ కూటమికి ఓటు వెయ్యొద్దని చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇకపోతే సూపర్ స్టార్ రజినీ కాంత్ థౌంజడ్ లైట్స్ ప్రాంతంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తన కుమార్తెలు శ్రుతిహాసన్ - అక్షర హాసన్ లతో కలిసి తేనాంపేటలో ఓటు వేశారు. అలాగే మరో స్టార్ హీరో అజిత్ తన సతీమణి షాలినితో కలిసి వచ్చి ఓటు వేశారు. సూర్య - కార్తీ మరియు వారి తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ టి.నగర్ లోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో డీఎంకె - అన్నా డి.ఎం.కె పార్టీలతో పాటుగా కమల్ హాసన్ తన సొంత పార్టీ 'మక్కల్ నీది మయ్యమ్' తరపున అభ్యర్థులను బరిలో దించాడు. మరి తమిళ ప్రజలు ఏ పార్టీ వైపు నిలబడతారో చూడాలి.