Begin typing your search above and press return to search.
విజయ్ ‘మాస్టర్’ను కాపీ కొట్టింది వీళ్లే..!
By: Tupaki Desk | 13 Jan 2021 4:02 AM GMTతమిళ్ లో సూపర్ స్టార్ తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న నటుడు థళపతి విజయ్. ఆయన సినిమా థియేటర్లకు వస్తుందంటే.. ఫ్యాన్స్ కు పూనకాలే. లాక్ డౌన్ గ్యాప్ తర్వాత సంక్రాంతి బరిలో నిలిచాడు విజయ్ ‘మాస్టర్’. దీంతో ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. ఇక తెలుగులోనూ విజయ్ గత సినిమాలు మంచి వసూళ్లు రాబట్టాయి. దానివల్ల ఇక్కడ కూడా క్రేజ్ పెరిగిపోయింది.
అయితే.. పొంగల్ సందర్భంగా విడుదల కావాల్సిన ఈ మూవీ ముందే లీక్ కావడం సంచలనం సృష్టించింది. ఈ లీకేజీతో దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఊహించని ఈ ఘటనతో దర్శక నిర్మాతలు తల పట్టుకున్నారు. ఎవరు చేశారు? అనేది తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సినిమాను లీక్ చేసిన వాళ్లెవరో తెలిసింది.
సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలు లీక్ అయ్యాయి. ఈ పరిస్థితిపై దర్శకుడు లోకేష్ కనకరాజ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాడు. ఏడాదిన్నర కాలం కష్టపడి తీసిన సినిమాను ఇలా చేయడం సరికాదన్నారు. వీటిని స్ప్రెడ్ చేయొద్దని నెటిజన్లను ప్రాధేయపడ్డాడు. అయితే.. విడుదలకు ముందే సినిమా ఎలా బయటికి వచ్చిందని ఆరా తీస్తే.. మాస్టర్ లీక్ వెనక ఉన్నది ఓ ఉద్యోగి అని తేలింది.
మాస్టర్ సన్నివేశాలను లీక్ చేసింది చెన్నైలో ప్రతిష్టాత్మకమైన శ్డ్ఛ్ థియేటర్ ఉద్యోగి అని బయట పడింది. దీంతో.. చిత్ర యూనిట్ సదరు ఉద్యోగిపై కంప్లైంట్ ఇచ్చింది. ఆ ఉద్యోగితో పాటు కంపెనీపై కూడా లీగల్ చర్యలు తీసుకోడానికి యూనిట్ సిద్ధమైంది. జనవరి 13న దాదాపు 2000 థియేటర్స్‌లో విడుదలవుతోంది మాస్టర్ మూవీ. రిలీజ్ కు ముందే ఇలా జరగడంతో చిత్ర బృందం తీవ్ర ఆవేదనలో కూరుకుపోయింది.