Begin typing your search above and press return to search.

ఆకాశ్ లో ఇంత ఫైర్ ఉందనుకోలేదు: విజయ్ దేవరకొండ

By:  Tupaki Desk   |   23 Oct 2021 3:12 AM GMT
ఆకాశ్ లో ఇంత ఫైర్ ఉందనుకోలేదు: విజయ్ దేవరకొండ
X
ఆకాశ్ పూరి హీరోగా 'రొమాంటిక్' సినిమా రూపొందింది. కేతిక కథానాయికగా అలరించనున్న సినిమా, నిన్నరాత్రి వరంగల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకకి వేల సంఖ్యలో అభిమానులు .. సినిమా ప్రేమికులు తరలివచ్చారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తనదైన స్టైల్లో మాట్లాడాడు.

"నేను వచ్చినప్పుడల్లా మీరు ఇంత ప్రేమ్ చూపిస్తే థాంక్స్ ఎట్ల చెప్పాలనో నాకు తెలియదు. నా వైపు నుంచి ఒకటే చేయగలుగుతాను. 'లైగర్' ఫంక్షన్ కి కూడా ఇక్కడికి వస్తాను. ఎట్లాగో ఆ సినిమా ఫ్యాక్షన్ ఇక్కడ చేస్తామని పూరిగారు కూడా ప్రామిస్ చేశారు. 'రొమాంటిక్' టీమ్ లోని చాలామంది 'లైగర్'కి పనిచేస్తున్నార్తు. వాళ్లంతా హ్యాపీగా ఉంటే నా 'లైగర్' పనులు తొందరగా అవుతాయి. ఈ సినిమా దర్శకుడు అనిల్ పాదూరి ఈ రోజున ఇక్కడ నిలబడి వాళ్ల మదర్ గర్వపడేలా స్పీచ్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం సునీల్ కాశ్యప్ ఇచ్చిన 'నా వల్ల కాదే పాట నాకు చాలా ఇష్టం.

కేతిక చాలా బ్యూటిఫుల్ .. ఆమె కి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఇక ఆకాశ్ ను ఉద్దేశించి .. "మీ నాన్న అంటే నాకు మస్తు ఇష్టం. ఈ రోజున నీ స్పీచ్ విన్న తరువాత నీ మీద కూడా ప్రేమ పుట్టింది. నీలో ఫైర్ ఉంది .. ఈ రోజున అది ఇంతమందిలో చెప్పే ధైర్యం ఉంది. ఇక చేసి నిరూపించాలి .. మీ నాన్న కాలర్ ఎత్తాలి. నాకు తెలుసు నువ్వు ఫిక్స్ అయ్యావంటే చేసి చూపిస్తావ్". ఆ తరువాత జనం వైపు తిరిగి . "ఆకాశ్ ను నేను ఇంతకుముందు కలవలేదు గానీ, ఆయనకి ఉన్న సినిమా పిచ్చి గురించి చార్మీ గారు నాకు చెబుతూ ఉంటారు. ఆకాశ్ ప్రతి సినిమా చూస్తాడట .. అన్ని సినిమాలు నచ్చుతాయట.

ఆర్టిస్టులు బాగున్నారు .. సంగీతం బాగుంది .. ఇలా చెబుతూ ఉంటాడు. 'ఆకాశ్ ను ఎప్పుడూ కూడా రివ్యూలు అడగొద్దు. వాడికి ప్రతీది నచ్చుతుంది' చెప్పినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఆయనలాంటివారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలి. సక్సెస్ అవుతావు .. కొట్టు .. కొంచెం గట్టిగా కొట్టు అంటూ ఆకాశ్ ను ఎంకరేజ్ చేశాడు. 'రొమాంటిక్' సినిమాను నేను చూడలేదు .. చూసినవాళ్లు గ్రేట్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. అందువలన ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కొడుతుందని భావిస్తున్నాను.

ఈ స్టేజ్ పై నేను 'లైగర్' గురించి మాట్లాడకూడదని అనుకున్నాను. టీజర్ .. ట్రైలర్ వచ్చిన తరువాతనే చెప్పాలనుకున్నాను. కాకపోతే ఈ రోజున 'రొమాంటిక్' ప్రీ రిలీజ్ కి రావడం .. ఇంతమంది ఇక్కడుండటం .. 'లైగర్ గురించి మీరంతా ఎదురుచూడటం వలన ఒక క్లారిటీని ఇద్దామని అనుకున్నాను. డెస్టినీ మా ముగ్గురినీ కలిపింది. పూరి - చార్మీ ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఒక విజువల్ పడితే మీకు కూడా అర్థమైపోతుంది. మేం ఒక్కటే ఫిక్స్ అయ్యాము .. ఇండియా షేక్ అవ్వాలి .. ఇండియాను షేక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి 'రొమాంటిక్' అక్టోబర్ 29వ తారీఖు. 'లైగర్' 2022," అంటూ చెప్పుకొచ్చాడు.