Begin typing your search above and press return to search.

నటుడిని అయితే నేను నాలా ఉండకూడదా?

By:  Tupaki Desk   |   26 July 2019 5:30 PM GMT
నటుడిని అయితే నేను నాలా ఉండకూడదా?
X
విజయ్‌ దేవరకొండ తన నటనతో పాటు యాటిటూడ్‌ తో కూడా యూత్‌ ఆడియన్స్‌ లో విపరీతమైన ఫాలోయింగ్‌ ను సొంతం చేసుకున్నాడు. అందరు హీరోల మాదిరిగా కాకుండా విజయ్‌ దేవరకొండ విభిన్నంగా ఆలోచిస్తాడని.. విభిన్నంగా ఉంటాడని ఆయన అభిమానులు అనుకుంటూ ఉంటారు. తాజాగా మరోసారి అందరు హీరోలకు తాను డిఫరెంట్‌ అంటూ చెప్పకనే చెప్పాడు. నేడు 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్‌ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ తన వ్యక్తిగత ప్రవర్తన గురించి స్పందించాడు.

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ నేను హీరో అయిన తర్వాత నన్ను కొందరు ఇలా చేయవద్దు.. అలా ప్రవర్తించవద్దు.. ఇలా మాట్లాడాలి అంటూ నాకు కొన్ని బౌండరీస్‌ పెట్టే ప్రయత్నం చేశారు. కాని నేను వాటిని పట్టించుకోదల్చుకోలేదు. నటుడిని అయినంత మాత్రాన నేను నాలా ఉండకుండా ఎలా ఉంటాను. ఎప్పుడైనా నేను నాలాగే ఉండాలనుకుంటాను. ఇతరుల మాదిరిగా ఎందుకు ఉండాలి. అందరు కూడా ఎవరికి వారు యునిక్‌ గా ఉంటారు. కాని చిన్నప్పటి నుండి కూడా ఒకే తరహా యూనిఫామ్‌.. ఒకే తరహా సమాధానాలు అంటూ అందరిని ఒకేటే మాదిరిగా చేస్తున్నారు.

ఒకానొకప్పుడు నేను కూడా సొసైటీలో అందరి మాదిరిగానే నేను ఉండే వాడిని. కాని పెరిగే కొద్ది జీవితం గురించి తెలుసుకుని కష్టాలతో యుద్దం చేస్తూ నేను ఎలా అయితే ఉండాలనుకుంటున్నానో అలాగే ఉండి పోయేందుకు ప్రయత్నించాను. నాకు వచ్చిన ప్రతి సక్సెస్‌ నాపై నా నమ్మకంను పెంచుతూ వచ్చింది. వేరే వారికి ఉన్న అలవాట్లను మనం పాటించాల్సిన అవసరం లేదు. నన్ను నాలా ఉండనివ్వండి అంటూ అందరితో చెబుతుంటాను అంటూ విజయ్‌ దేవరకొండ చెప్పుకొచ్చాడు.