Begin typing your search above and press return to search.

వీడియో : కరోనా బాధ్యత రౌడీకి అప్పగించిన టీ ప్రభుత్వం

By:  Tupaki Desk   |   10 March 2020 1:12 PM GMT
వీడియో : కరోనా బాధ్యత రౌడీకి అప్పగించిన టీ ప్రభుత్వం
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇటీవలే లక్షలో ఈ సంఖ్య చేరింది. మృతుల సంఖ్య కూడా వందల నుండి వేలకు పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు అన్ని కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇండియాలో కూడా కరోనా బాధితులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక హైదరాబాద్‌ లో ఒక కరోనా కేసు నమోదు అవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది.

రాష్ట్ర ఆరోగ్య మరియు హోం సమాచార శాఖలు కలిసి కరోనా వైరస్‌ పై అవగాహణ పెంచేందుకు సిద్దం అయ్యారు. కరోనా వైరస్‌ గురించి భయం అక్కర్లేదని.. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే కరోనా నుండి దూరంగా ఉండవచ్చు అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు నుండి చెబుతుంది. అదే విషయాన్ని విజయ్‌ దేవరకొండతో చెప్పించడం జరిగింది.

తాజాగా విజయ్‌ దేవరకొండతో కరోనా వైరస్‌ అవగాహణ మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక వీడియోను చిత్రీకరించి విడుదల చేయడం జరిగింది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే ఏం చేయాలి... వ్యాప్తి చెందితే ఏం చేయాలి అనే విషయాలను విజయ్‌ దేవరకొండ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటివి ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా విజయ్‌ దేవరకొండను బ్రాండ్‌ అంబాసిడర్‌ గా నియమిస్తుంది. ఈసారి కూడా విజయ్‌ దేవరకొండతో కరోనా అవగాహణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆయనతో ఒక యాడ్‌ ను కూడా షూట్‌ చేయడం జరిగింది.