Begin typing your search above and press return to search.
దేవరకొండతో అంత వీజీ కాదు..
By: Tupaki Desk | 30 Aug 2017 8:26 AM GMTకొందరేమో పవన్ కళ్యాణ్ తర్వాత ఆ స్థాయి హీరో అంటున్నారు. వర్మ ఏమో పవన్ కళ్యాణ్ కన్నా పది రెట్లు బెటర్ అంటున్నాడు. కొందరు తెలంగాణ సూపర్ స్టార్ అంటూ కీర్తించేస్తున్నారు. మొత్తానికి ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండ గురించి పెద్ద చర్చే నడుస్తోందిప్పుడు. ఐతే ఈ ఒక్క సినిమాను చూసి విజయ్ మీద ఓ అభిప్రాయానికి వచ్చేసి.. అతణ్ని పెద్ద స్టార్ అంటూ అభివర్ణించేయడం కరెక్ట్ కాదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. గత ఏడాది విజయ్ నటించిన ‘పెళ్లిచూపులు’ బ్లాక్ బస్టర్ హిట్టయింది. కానీ ఆ తర్వాత వచ్చిన ‘ద్వారక’ ఏమైందో తెలిసిందే. ‘పెళ్లిచూపులు’ పాజిటివ్ ఎఫెక్ట్ దాని మీద ఎంతమాత్రం లేకపోయింది. ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ విషయంలో కనిపిస్తున్న మేనియా విజయ్ తర్వాతి సినిమాల విషయంలో ఉంటుందా అంటే డౌటే.
‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి మ్యాజిక్స్ ప్రతిసారీ జరిగిపోవు. ఈ సినిమాకు అనుకోకుండా హైప్ వచ్చింది. ఆ హైప్ కు తగ్గట్లే సినిమా కూడా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోందా సినిమా. విజయ్ అర్జున్ రెడ్డి పాత్రలో అద్భుతంగా నటించిన మాట వాస్తవం. ఐతే ఇక్కడ క్యారెక్టర్ గొప్పదనం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ క్యారెక్టర్ చూశాక.. విజయ్ తో పని చేయడానికి రెడీ అయిన మిగతా దర్శకుల్లో కంగారు పుట్టి ఉంటే ఆశ్చర్యం లేదు. అర్జున్ రెడ్డి అనేది విజయ్ కి లైఫ్ టైం క్యారెక్టర్. అలాంటి పాత్రే కాదు.. దాని స్థాయికి దగ్గరగా ఉండే పాత్రను డిజైన్ చేయడం కూడా మిగతా దర్శకులకు కష్టసాధ్యమే. వేరే దర్శకులేంటి.. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డికి కూడా అలాంటి ఇంకో పాత్రను తయారు చేయడం సవాలే. ఇక మిగతా దర్శకుల సంగతి చెప్పేదేముంది?
అర్జున్ రెడ్డిగా విజయ్ ప్రేక్షకులకు ఇచ్చిన కిక్కు అలాంటిలాంటిది కాదు. ఇకపై అతను నటించే ప్రతి సినిమా నుంచి జనాలు ఇలాంటి కిక్కే ఆశిస్తారు. అతను ఏ పాత్ర చేసినా అర్జున్ రెడ్డితో పోల్చి చూస్తారు. ఇది విజయ్ కు ఇబ్బందికరమైన విషయమే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. విజయ్ తో రెగ్యులర్ కమర్షియల్ సినమాలు చేస్తే వర్కవుట్ కాదు. రెగ్యులర్ క్యారెక్టర్లకు అతను ఏమాత్రం సరిపోడని ‘ద్వారక’తోనే రుజువైంది. ఈ నేపథ్యంలో విజయ్ కు తగ్గ పాత్రలు.. సినిమాలు రూపొందించడం అన్నది దర్శకులకు పెద్ద సవాలే. మరి ఈ సవాలును విజయ్ తో సినిమాలకు రంగం సిద్ధం చేసుకుంటున్న పరశురామ్.. నందిని రెడ్డి.. భరత్ కమ్మ లాంటి దర్శకులు ఎలా స్వీకరిస్తారో చూడాలి.