Begin typing your search above and press return to search.
సక్సెస్ తో అర్జున్ రెడ్డి మారిపోయాడా?
By: Tupaki Desk | 21 Sep 2017 6:03 AM GMTఓ భారీ సక్సెస్ వచ్చిన తర్వాత.. హీరోల్లో మార్పులు కనిపించడం సహజంగా జరిగేదే. ఇవి మరీ ఎక్కువగా ఉన్నపుడు.. ఓ హిట్టు పడేసరికి వీడు బాగా మారిపోయాడంటూ.. కామెంట్స్ కూడా ఎక్కువవుతాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలో ఇదే జరుగుతోంది. అర్జున్ రెడ్డి అనుకోని స్థాయిలో గ్రాండ్ సక్సెస్ సాధించిన తర్వాత.. ఈ 28ఏళ్ల యంగ్ హీరోపై చాలా రకాల మాటలే వస్తున్నాయి.
రెమ్యూనరేషన్ పెంచాడని.. ఇగో ఫీలింగ్ అని.. ఇలాంటి మాటలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. అయితే.. తన గురించి ఇతరులకు తెలియని విషయం ఏంటంటే అంటూ.. అర్జున్ రెడ్డి తర్వాత తన కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగిందని చెబుతున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు పెద్ద సక్సెస్ సాధిస్తుందని తాను ముందు చెబితే ఎవరూ పట్టించుకోలేదని.. అందుకు కారణం.. అప్పటికి తాను ఎవరికీ తెలియకపోవడమే అన్న విజయ్.. అర్జున్ రెడ్డిపై ఇలాగే చెప్పినపుడు.. రకరకాల ఒపీనియన్స్ చెప్పారని అన్నాడు. ఆ సక్సెస్ తర్వాత.. సినిమాలకు.. షాప్ ఓపెనింగ్స్ కు.. రిబ్బన్ కటింగ్స్ కు.. యాడ్ ఎండార్స్ మెంట్స్ కు చాలానే పిలుపులు వస్తున్నాయని.. తాను మాత్రం తనకు నచ్చిన వస్తువులకే ప్రచారం చేసే ఉద్దేశ్యంతో.. వీటిని తప్పించుకునేందుకు పెద్ద మొత్తం అడిగి భయపెడుతున్నట్లు చెప్పాడు.
ప్రస్తుతం ఒక్కో సినిమాకు 4 కోట్ల చొప్పున రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది. "నాకేమీ ఈ సక్సెస్ సింపుల్ గా రాలేదు. నేను ఇందుకోసం చాలా కష్టపడ్డాను. బొద్దుగా ఉండే వాడిని ఇలా మారేందుకు చాలానే శ్రమించాను. లైఫ్ లో కంఫర్ట్స్ కోసం నాలో ఫైర్ ఉండేది. ఇప్పుడ సక్సెస్ జోన్ లోకి వ్చచాను. డబ్బు.. ఇల్లు.. కారు.. అన్నీ సమకూరాయి. అలాగని నాలో ప్యాషన్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా పెరిగింది కూడా" అంటున్నాడు విజయ్ దేవరకొండ.