Begin typing your search above and press return to search.
'లైగర్' వ్యక్తిగా నాలో చాలా మార్పులకు కారణమైంది: VD
By: Tupaki Desk | 6 Nov 2022 6:52 AMసెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. సినిమాలతోనే కాకుండా తన రియల్ లైఫ్ యాటిట్యూడ్ తో రౌడీ హీరోగా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అతను నటించిన 'పెళ్లి చూపులు' 'అర్జున్ రెడ్డి' 'గీత గోవిందం' 'టాక్సీవాలా' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించాయి.
అయితే విజయ్'D ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నారు. 'డియర్ కామ్రేడ్' 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి సినిమాలతో పరాజయాలు అందుకున్న యువ హీరో.. ఇటీవల 'లైగర్' చిత్రంతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. ఇండస్ట్రీలో హిట్లు ప్లాపులు సర్వసాధారణం. కాకపోతే రిలీజ్ ముందు వీడీ ఈ సినిమా మీద అతి విశ్వాసం చూపించడం.. కంటెంట్ ఆ స్థాయిలో లేకపోవడంతో ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
నిజానికి VD 'లైగర్' సినిమా కోసం మూడేళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించడమే కాదు.. తన పాత్ర కోసం చాలా హార్ట్ వర్క్ చేసాడు. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని భావించాడు. కానీ ఫలితం మాత్రం వేరేలా వచ్చింది. అప్పటి నుంచి మీడియా మరియు సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్న విజయ్.. బెంగుళూరు వేదికగా జరిగిన సైమా అవార్డ్స్ లో 'లైగర్' ప్లాప్ గురించి మాట్లాడారు.
ఇప్పుడు తాజాగా ఓ తెలుగు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘లైగర్’ సినిమా పరాజయాన్ని ఎలా పేస్ చేసారు? అది తన లైఫ్ లో ఎలాంటి మార్పులకు కారణం అయ్యింది? అనే అంశాలపై విజయ్ దేవరకొండ స్పందించారు. ఈ సినిమా కోసం తాను చాలా కష్టపడ్డానని.. ఈ ప్రాసెస్ లో ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చేశానని.. అయినా ఫలితం దక్కకాకపోవడం నిరాశపరిచిందని వీడీ తెలిపారు.
కొన్ని సార్లు తప్పులు చేస్తుంటాం. తప్పులు చేయటం లేదంటే మనం జీవితంలో దేని కోసం గట్టిగా ట్రై లేదని అర్థం. కంఫర్ట్ జోన్ లో ఎంత చేసినా అందులో పస ఉండదు. అంటే నేను ముందుకు వెళ్లడం లేదని అర్థం. ఎదగాలంటే కొత్తగా ప్రయత్నం చేయాలి. ఇంకా కష్టపడాలి. గొప్ప పనులు చేయాలనే కోరిక ఉండాలి. కొన్నిసార్లు మన ప్రయత్నం ఫలించకపోవచ్చు. కానీ ఆ ప్రయత్నం చేయడం ముఖ్యం అని విజయ్ చెప్పారు.
సక్సెస్ దక్కినా దక్కకపోయినా విజయ్ దేవరకొండ ఎవరు? అతని స్థాయి ఏమిటి? అతనికి ఏం కావాలి? అతను ఏం చేయగలడు? అనే అవగాహన నాకు ఉండాలి. మనమేంటో మనకు తెలియడం చాలా ముఖ్యం. నేనేంటో నాకు తెలుసు అని VD పేర్కొన్నారు. మనం ఒక విషయం చాలా ముఖ్యం అనుకున్నప్పుడు.. దాని కోసం చాలా కష్టపడి పనిచేస్తాం. ఆశించిన ఫలితం రాకపోయినా కూడా ముందుకు వెళ్లడానికి మనం రెడీగా ఉండాలి. మనుషులకు అదే పెద్ద సవాల్ అని విజయ్ అన్నారు.
వెనుకడుగు వేయడానికి తాను ఇష్టపడనని.. సుదీర్ఘ ప్రయాణంలో ఎత్తుపల్లాలు ఉంటాయని చెప్పారు. ‘లైగర్’ చిత్రం వ్యక్తిగా తనలో చాలా మార్పులకు కారణమైందని రౌడీ హీరో పేర్కొన్నారు. ఒక పెద్ద సినిమా చేయటమనేదే మంచి అవకాశం. నేను ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ పని చేశా. ఈ క్రమంలో వ్యక్తిగా నాలో చాలా సానుకూల మార్పులకు కారణమైంది. ఇంతకు ముందెప్పుడూ చేయని విధంగా బాడీని రెడీ చేశా. అలాగే నత్తితో మాట్లాడడం చాలా కష్టంగా అనిపించినప్పటికీ.. దాన్ని కూడా ఎంజాయ్ చేశానని తెలిపారు.
సినిమాను పాన్ ఇండియా వైడ్ తీసుకెళ్లడానికి దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ చేయడం అనేది తన లైఫ్ లో గొప్ప అనుభవమని విజయ్ పేర్కొన్నారు. సినిమాపై భారీ హెప్ తీసుకురావడానికి తాను చేయగలిగినదంతా చేశానని చెప్పారు. నత్తి గురించి తనకు పెద్దగా తెలియదని.. స్ర్కిప్టు చదివి ‘లైగర్’ లో పాత్ర గురించి అవగాహన చేసుకున్నానన్నారు. అంతేకాదు ఈ పాత్ర బాడీని పూర్తిగా మార్చుకున్నానని.. గతంలో ఎప్పుడూ లేని విధంగా మరింత దృఢంగా మలచుకున్నానన్నారు.
మొదటి నుంచీ తనకు విరామం లేకుండా కష్టపడడం అలవాటని విజయ్ అన్నారు. పనిలో వెనుకడుగు అనేది తనకు ఇష్టం లేదని.. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం రిలాక్స్ అవుతున్నానని.. ఒకడుగు వెనక్కు వేయడం అలవాటు చేసుకున్నానని తెలిపారు. తానెంతే నిరూపించుకోవాలనే తపన.. గౌరవం పొందాలనే కాంక్ష తనలో ఉన్నాయని.. కానీ అన్నీ ఇప్పుడే చేసేయాలని అనుకోవడం లేదని.. ప్రస్తుతం తాను కొంచెం రిలాక్స్ అవుతున్నానని VD చెప్పుకొచ్చారు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఇందులో సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తైన ఈ మూవీ తదుపరి షెడ్యూల్ కోసం వేచి చూస్తున్నారు. సామ్ నారోగ్యంతో భాద పడుతున్న కారణంగా ఈ సినిమా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
'ఖుషి' చిత్రాన్ని వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేకి వస్తుందని అనుకున్నారు కానీ.. పరిస్థితులు చూస్తుంటే సమ్మర్ లో రిలీజ్ అవ్వొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక 'లైగర్' తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ మరియు పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా సెట్స్ మీదకు తీసుకెళ్లిన 'JGM' (జనగణమన) ప్రాజెక్ట్ ను పూర్తిగా పక్కన పెట్టేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.