Begin typing your search above and press return to search.
క్రేజీ కాంబోలో హ్యాట్రిక్ మూవీ అలాంటి జోనర్ లో ఉంటుందా..?
By: Tupaki Desk | 20 July 2022 3:30 AM GMT'ఇస్మార్ట్ శంకర్' తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి ప్లాప్ అందుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ''లైగర్''. ఇది మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో రూపొందిన పాన్ ఇండియా యాక్షన్ ఫిలిం. ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'లైగర్: సాలా క్రాస్ బ్రీడ్' మూవీ విడుదల కాకముందే పూరీ - విజయ్ కలిసి 'JGM' (జనగణమన) అనే మరో భారీ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ క్రేజీ కాంబోలో ముచ్చటగా మూడో సినిమా కూడా చేయబోతున్నారని.. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
తాజాగా వీడీ-పూరీ హ్యాట్రిక్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అదేంటంటే రౌడీ స్టార్ కోసం అగ్ర దర్శకుడు ఓ సోషియో ఫాంటసీ కథను సిద్ధం చేశారట. ఇప్పటికే విజయ్ కు స్టోరీ చెప్పారని.. హీరో సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు.
తెలుగులో సింగీతం శ్రీనివాస్ - రాఘవేంద్రరావు - ఎస్ఎస్ రాజమౌళి వంటి పలువురు దర్శకులు సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ కూడా ఇప్పుడు వారి బాటలోనే పయనించనున్నారని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఇది కూడా పాన్ ఇండియాను టార్గెట్ గా రూపొందించనున్నారని తెలుస్తుంది.
పూరీ ఇప్పటి వరకు సోషల్ ఫాంటసీ జోనర్ లో సినిమాలు చేయలేదు. విజయ్ దేవరకొండకు కూడా అంతే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ కొత్త కథతో రాబోతున్నారని అంటున్నారు. పూరీ ఇప్పటి పక్కా మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్స్ డైరెక్ట్ చేస్తూ వచ్చారు. అందుకే ఇప్పుడు సోషియో ఫాంటసీ సబ్జెక్టుని ఎలా హ్యాండిల్ చేస్తాడో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఎందుకంటే పూరీ చాలా ఫాస్ట్ గా కథ రెడీ చేయడమే కాదు.. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా జెట్ స్పీడ్ తో సినిమాలను పూర్తి చేస్తుంటాడు. కానీ సోషియో ఫాంటసీ మూవీ అంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. భారీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ గ్రాఫిక్స్ అవసరం అవుతాయి. దీని కోసం చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి పూరీ ఎలాంటి విజువల్ గ్రాండియర్ ను అందిస్తారో చూడాలి.
ఇకపోతే VD - పూరీ ప్రస్తుతం 'లైగర్' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. పూరీ కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించాయి. ఈ మూవీ రిజల్ట్ చూడకుండానే పూరీ మీద నమ్మకంతో 'JGM' కి కమిట్ అయ్యాడు విజయ్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీద ఉండగానే మరో మూవీకి ఓకే అన్నారని చెబుతున్నారు.
అయితే పూరీతోనే లైన్ గా సినిమాలు చేసుకుంటూ పోతే మిగతా క్రేజీ డైరెక్టర్లు వీడీ కోసం వేచి చూస్తారా అని రౌడీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాకముందే దీని గురించి చర్చించడం తొందర అవుతుందని చెప్పాలి.