Begin typing your search above and press return to search.
ఫొటోస్టోరీ: గోవిందం భలే ఎత్తాడు
By: Tupaki Desk | 10 Aug 2018 4:36 PM GMTవిజయ్ దేవరకొండ అంటే ఇప్పుడు రొమాంటిక్ హీరోనే కాదు... అంతకుమించి! ఆయన ఏ సినిమా చేసినా కథానాయికని ఎన్నిసార్లు ముద్దు పెట్టుకొన్నాడో అన్న కోణంలో ఆలోచించేవాళ్లే ఎక్కువ. ఆయన స్టేట్ మెంట్లు కూడా అలానే ఉంటాయి. ఇమ్రాన్ హస్మీలాగా మీ సినిమాల్లో ముద్దు కంపల్సరీనా అని అడిగితే... ``ప్రపంచంలో ఇమ్రాన్ హస్మీ ఒక్కడే ముద్దులు పెట్టుకోవాలా ఏంటీ? మనోళ్లు ఎవ్వరూ ముద్దులు పెట్టుకోవడం లేదో - కమాన్ యార్. ముద్దొస్తే ఎవ్వరైనా ముద్దు పెట్టుకుంటారు`` అంటూ తనదైన స్టైల్ లో జవాబిస్తుంటాడు. అయితే కథ రీత్యా `గీత గోవిందం`లో మాత్రం నేను చాలా మారిపోయాను - అయామ్ డీసెంట్ నౌ అంటున్నాడు. దాన్నిబట్టి సినిమాలో కూడా ఆయన డీసెంట్ గానే కనిపిస్తాడని అర్థం చేసుకోవచ్చు.
అయితే రొమాంటిక్ కోణం పరంగా మాత్రం ఆయన ఏమాత్రం తక్కువ చేయడనిపిస్తోంది. ఇప్పటిదాకా విడుదలైన టీజర్లు - పోస్టర్లని బట్టి చూస్తుంటే ఆ విషయం పక్కాగా రూడీ అవుతోంది. టైమ్ ఫ్లై అవుతోంది, ఇక సినిమా విడుదలకి నాలుగు రోజులే అంటూ తాజాగా విజయ్ దేవరకొండ ఓ కొత్త పోస్టర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దాన్ని చూస్తున్న నెటిజన్లంతా నీ చేతుల్లో అమ్మాయి కూడా బాగానే ఫ్లై అవుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీ ఈ ఫొటోలో మాత్రం రొమాంటిక్ కోణం మరింత బలంగా కనిపిస్తోంది కదూ! ఎంతైనా గోవిందం తన గీతని భలే ఎత్తాడబ్బా!