Begin typing your search above and press return to search.
మా లవ్ అఫైర్ పుకార్లు క్యూట్ గా అనిపిస్తాయి..?
By: Tupaki Desk | 2 Oct 2022 2:30 AM GMTనేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం ముంబయిలో తన హిందీ సినిమా గుడ్ బై ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అక్టోబర్ 7వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమా పై చాలా నమ్మకంతో ఉన్న రష్మిక మందన్నా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ప్రేమ విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కన్నడకు చెందిన ఈ అమ్మడు గీత గోవిందంకు ముందే కన్నడ హీరోతో ప్రేమలో పడింది.. ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం కూడా ఫిక్స్ అయ్యి నిశ్చితార్థం జరిగింది. కానీ ఏదో కారణం వల్ల పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న రష్మిక వెనుదిరిగి చూసుకోకుండా వరుస సినిమాలతో సౌత్ ఇండియా మరియు నార్త్ ఇండియాలో దూసుకు పోతుంది.
ఈ సమయంలోనే రష్మిక మందన్న యొక్క లవ్ అఫైర్స్ గురించి మీడియాలో మళ్లీ మళ్లీ కథనాలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా డియర్ కామ్రెడ్ సమయంలో రష్మిక మందన్నా మరియు విజయ్ దేవరకొండలు ప్రేమలో ఉన్నట్లుగా చాలా బలమైన పుకార్లు షికార్లు చేశాయి. వారిద్దరిని చూస్తే నిజంగానే ప్రేమలో ఉన్నారేమో అన్నట్లుగా క్లోజ్ గా ఉండేవారు.
తాజాగా విజయ్ దేవరకొండతో లవ్ అఫైర్ గురించి ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. మేము ఇద్దరం గీత గోవిందం సమయంలో స్నేహితులుగా మారాం. హైదరాబాద్ లో నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది విజయ్ కి నాకు కామన్ స్నేహితులు ఉన్నారు.
అందువల్ల అక్కడికి వెళ్లిన సమయంలో బాగా ఎంజాయ్ చేస్తాం. అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు అన్నట్లుగా రష్మిక చెప్పుకొచ్చింది. మా ఇద్దరి గురించి లవ్ అంటూ పెళ్లి అంటూ వచ్చే పుకార్లు చాలా క్యూట్ గా అనిపిస్తాయి అంటూ రష్మిక మురిసి పోవడం కొసమెరుపు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.