Begin typing your search above and press return to search.

హీటెక్కిస్తున్న ‘అర్జున్ రెడ్డి’ జంట

By:  Tupaki Desk   |   31 Dec 2016 1:30 PM GMT
హీటెక్కిస్తున్న ‘అర్జున్ రెడ్డి’ జంట
X
ఎవడే సుబ్రమణ్యం మూవీతో అల్లరి కుర్రాడిగా పరిచయమైన విజయ్ దేవరకొండ.. పెళ్లి చూపులు మూవీలో ఓ లక్ష్యం అంటూలేని లేజీ బాయ్ గా నటించి.. బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో చిన్న నిర్మాత కళ్లన్నీ విజయ్ దేవరకొండ వైపే చూస్తున్నాయంటే.. అతని క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. ఓ వైపు ద్వారక సినిమాను కంప్లీట్ చేసేసి.. రిలీజ్ కు సిద్ధంగా వుంచాడు. మరోవైపు అర్జున్ రెడ్డితో మన ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా భాగం ఇటలీలో షూట్ చేశారు.

ఈ మూవీకి సంబంధించిన ఓ ఫొటో చూస్తుంటే.. కుర్రకారుకు మతిపోయేలా వుంది. హీరోయిన్ శాలినితో కలిసి విజయ్ చేసిన లిప్ లాక్ ను చూస్తే.. కుర్రకారుకు వెర్రెత్తిపోవడం ఖాయం. కంప్లీట్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రేమలో వున్న ఇద్దరు యువతీ యువకులు.. నూతన సంవత్సరానికి ఎంత ఘాటు చుంబనంతో స్వాగతం పలుకుతున్నారో మీరే చూడండి. ఈ చిత్రానికి దర్శకత్వం సందీప్ వంగా.. నిర్మాత ప్రణయ్ వంగా. ఇప్పటికే టాకీపార్టు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా వుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/