Begin typing your search above and press return to search.
'లైగర్' ప్లాప్ తర్వాత తొలిసారి తెలుగు మీడియాని ఫేస్ చేయబోతున్న VD..!
By: Tupaki Desk | 18 Oct 2022 7:06 AM GMTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ''లైగర్'' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై VD చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందని నమ్మాడు. ఆ నమ్మకంతోనే ఇండియా మొత్తం షేక్ అవుతుందని మీడియా ముఖంగా ధీమా వ్యక్తం చేశాడు. అయితే ఫలితం మాత్రం మరోలా వచ్చింది.
'లైగర్' సినిమా ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. విజయ్'D తన పాత్ర కోసం పడిన కష్టమంతా తెర మీద కనిపించినా.. దానికి తగ్గట్టుగా సినిమాలో కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు నిర్థాక్ష్యంగా తిరస్కరించారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన వీడీ.. అప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే లైగర్ ప్లాప్ తర్వాత ఇప్పుడు తొలిసారిగా తెలుగు మీడియాని ఫేస్ చేయబోతున్నాడు.
ఇటీవల వైభవంగా జరిగిన 'సైమా' అవార్డ్స్ కు విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. కాకపోతే అది బెంగళూరులో నిర్వహించిన ఈవెంట్. అందుకే తెలుగు మీడియా మరియు ప్రేక్షకులు వీడీ పై పెద్దగా ఫోకస్ చేయలేదు. కానీ ఇప్పుడు హైదరాబాద్ వేదికగా జరిగే సినిమా ఫంక్షన్ కు VD చీఫ్ గెస్టుగా హాజరవుతుండటంతో.. అందరి దృష్టి నెలకొంది.
అనుదీప్ కేవీ దర్శకత్వంలో తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన 'ప్రిన్స్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం JRC కన్వెన్షన్ సెంటర్ లో జరగబోతోంది. దీనికి టాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ - రానా దగ్గుబాటి తో పాటుగా డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిలుగా హాజరవుతున్నారు.
'ప్రిన్స్' సినిమా గురించి తెలుగులో ఎవరూ పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు కానీ.. 'లైగర్' డిజాస్టర్ తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్ లో ఓ సినిమా ఫంక్షన్ కు విజయ్ అటెండ్ అవుతుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. విజయ్ దేవరకొండ స్టేజీ మీద ఏం మాట్లాడతారు అని రౌడీ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.
కాగా, సైమా అవార్డ్స్ లో 'యూత్ ఐకాన్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ సినిమా' అవార్డును గెలుచుకున్న విజయ్.. 'లైగర్' ప్లాప్ పై స్పందించాడు. ''నేను ఈ ఏడాది ఒక గొప్ప సినిమా చేయడానికి ట్రై చేశా. ఎంత చేయాలో అంతా చేశా. కానీ అది సరిపోలేదు. ఈసారి మాత్రం మంచి సినిమాతో వస్తాను'' అని వీడీ అన్నారు.
''మనందరికీ మంచి రోజులు ఉంటాయి.. చెడ్డ రోజులు ఉంటాయి. ఎలాంటి రోజుల్లోనైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనం చేయాల్సిన పనులన్నింటినీ జాగ్రత్తగా చేయాలి. నిజం చెప్పాలంటే నేను ఈ అవార్డ్ కోసం ఇక్కడికి రాకూడదనుకున్నా. కానీ మీ అందరికీ ఓ మాట ఇవ్వడం కోసమే ఇక్కడికి వచ్చా.. అభిమానులు, కుటుంబం, స్నేహితులు.. అందరినీ అలరించేందుకు నేను మరింత కష్టపడి పనిచేస్తా.. గొప్ప సినిమాతో వస్తాను" అని విజయ్ చెప్పారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.