Begin typing your search above and press return to search.
విజయ్ దేవరకొండ.. ట్యాక్సీవాలా
By: Tupaki Desk | 29 Nov 2017 11:30 AM GMT‘అర్జున్ రెడ్డి’ సినిమాతో రాత్రికి రాత్రే పెద్ద రేంజికి వెళ్లిపోయాడు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా ఊపుతో స్వల్ప వ్యవధిలో అరడజను సినిమాల దాకా ఓకే చేశాడు విజయ్. అందులో గీతా ఆర్ట్స్.. యువి క్రియేషన్స్.. వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద పెద్ద బేనర్లలో చేయబోయే సినిమాలుండటం విశేషం. ఇందులో గీతా ఆర్ట్స్ బేనర్లో పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ముందుగా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకావశముంది. దీని తర్వాత యువి క్రియేషన్స్ బేనర్లో తెరకెక్కుతున్న సినిమా రావచ్చు. ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్సయిపోవడం విశేషం. ట్యాక్సీవాలా.. ఇదీ విజయ్ ‘యువీ క్రియేషన్స్’ బేనర్లో చేస్తున్న సినిమా పేరు.
షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి పేరు సంపాదించి.. ఇంతకుముందు ‘ది ఎండ్’ అనే హార్రర్ సినిమా తీసి అప్లాజ్ అందుకున్న రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘ట్యాక్సీవాలా’ రూపొందుతోంది. టైటిల్ చూస్తే.. ఇందులో విజయ్ ట్యాక్సీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నాడన్న విషయం అర్థమైపోతుంది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని అంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చిందట. ఫిబ్రవరి లేదా మార్చిలో ‘ట్యాక్సీవాలా’ ప్రేక్షకుల ముందుకు రావొచ్చని సమాచారం. దీంతో పాటు పరశురామ్ సినిమాలోనూ సమాంతరంగా నటిస్తున్న విజయ్.. ఇంకా భరత్ కమ్మ అనే డెబ్యూ డైరెక్టర్ తో.. క్రాంతిమాధవ్.. నందిని రెడ్డిలతోనూ సినిమాలు చేయాల్సి ఉంది. ఇంకో రెండేళ్ల దాకా అతడికి ఖాళీ లేనట్లే.