Begin typing your search above and press return to search.
ఇంతకుముందు మా గల్లీలో కూడా నేనెవరో తెలియదు
By: Tupaki Desk | 8 Nov 2021 4:04 AM GMTఒక వైపున హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్న విజయ్ దేవరకొండ, మరో వైపున నిర్మాతగా తన సొంత బ్యానర్లో సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. తాజాగా ఆయన 'పుష్పక విమానం' సినిమాను నిర్మించాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో దిగిపోనుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడాడు.
ఈ సినిమా ఒప్పుకున్న దగ్గర నుంచి ఆనంద్ దేవరకొండ అన్ని వ్యవహారాలు చూసుకున్నాడు. ముఖ్యంగా ప్రమోషన్స్ కి సంబంధించిన వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటున్నాడు. మొన్నటి వరకూ వాడికి నేను పేమెంట్ కూడా ఇవ్వలేదు. నేను కూడా ముందుగా సినిమా చేసి ప్రొడ్యూసర్ కి డబ్బులు వచ్చిన తరువాతనే తీసుకున్నాను .. నీకు కూడా అట్లనే ఇస్తానంటే .. ఓకే ఉన్నాడు. మొన్న డబ్బులు అందగానే ముందుగా వాడికి ఇవ్వాల్సిన పెపెంట్ ఇచ్చేశాను.
ఇక గీత్ శైనీ .. శాన్వి మేఘన గురించి మాట్లాడతాను. "సినిమాలో గీత్ లేచిపోయిందని తెలిసినా ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తాము .. ఆమె గురించే ఎదురుచూస్తాము. ఫస్టు సినిమాకే ఎంతో ముద్దుగా పెర్ఫార్మ్ చేసింది. ఆమెకి మంచి ఫ్యూచర్ ఉంది. శాన్వి మేఘన ఫుల్ టాలెంటెడ్ పిల్లా .. ఆమె పర్సనాలిటీ .. పెర్ఫార్మెన్స్ చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఈ సినిమాలో ఆమె కామిక్ టైమింగ్ అదిరిపోయింది. ఆమెలో చాలా టాలెంట్ ఉందనే విషయం నాకు అర్థమైంది.
దర్శకులు .. నిర్మాతలు ఆ అమ్మాయి మీద ఒక కన్ను పెట్టండి. మంచి రోల్స్ రాయండి .. ఎందుకంటే ఏ రోల్ ఇచ్చినా ఆమె న్యాయం చేయగలదు. శాన్వి టాలెంట్ ను ఎవరూ క్వశ్చన్ చేయలేరు. మంచి కథలు .. పాత్రలు ఎంచుకుంటే ఆమెకి లాంగ్ రన్ ఉంది. డైరెక్టర్ రైటింగ్ స్కిల్స్ గురించి .. మార్క్ రాబిన్ ఇచ్చిన మ్యూజిక్ ను గురించి గొప్పగా చెప్పుకోవలసి ఉంటుంది. సునీలన్నా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను తన షోల్డర్స్ పై వేసుకుని నడిపిస్తున్నాడు. సీనియర్ నరేశ్ సార్ ఈ సినిమాలో విపరీతంగా నవ్వించాడు.
వీళ్లంతా ఇంత బాగా చేయడం వల్లనే ఈ సినిమా ఇంత మంచిగా వచ్చింది. నాకంటే సీనియర్స్ నా గురించి మాట్లాడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. నిజానికి వాళ్లంతా నా సినిమాలో చేయడం నాకు చాలా గర్వకారణం. ఒక సిక్స్ .. సెవెన్ ఇయర్స్ బ్యాక్ మా గల్లీలో కూడా నేను ఎవరనేది తెలియదు. అలాంటిది ఈ రోజున వైజాగ్ ఒక వేదికపై ఒక యాక్టర్ గా .. ప్రొడ్యూసర్ గా నిలబడటం ఆనందంగా ఉంది. చాలామంది నన్ను నమ్మి నా విజన్ కోసం పనిచేస్తున్నారు. వాళ్లందరికీ నేను థ్యాంక్స్ చెబుతున్నాను.
అలాగే మా అమ్మానాన్నలకు కూడా థ్యాంక్స్ చెబుతున్నాను. రెంట్ కట్టడానికి డబ్బులు లేకపోయినా, నేను ఆడిషన్స్ కి వెళ్లడానికి పెట్రోల్ కి డబ్బులు ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ బిగ్ డ్రీమ్స్ కనమనే అనేవారు. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టమనే మా డాడీ ఎప్పుడూ చెబుతూ వచ్చాడు. అలా మా కలలు నిజం చేసుకునే దారిలో మేము నడవడానికి తగిన స్వేచ్ఛను వాళ్లు ఇచ్చారు. నా ఫ్రెండ్స్ .. నా అభిమానులు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. అందుకు వాళ్లందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.