Begin typing your search above and press return to search.

యూరీ సెక్టార్ లో జవాన్లతో కలిసి తుపాకీ పట్టిన రౌడీ స్టార్..!

By:  Tupaki Desk   |   16 Oct 2022 3:45 AM GMT
యూరీ సెక్టార్ లో జవాన్లతో కలిసి తుపాకీ పట్టిన రౌడీ స్టార్..!
X
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ దేశ సరిహద్దు ప్రాంతానికి వెళ్లారు. బారాముల్లాలో నియంత్రణ రేఖకు దగ్గరలో ఉన్న యూరీ సెక్టార్ ను సందర్శించారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న భారత జవాన్లను కలిసి, వారితో సరదాగా ముచ్చటించారు. ఈ విషయాన్ని VD సోషల్ మీడియాలో వెల్లడించారు.

భారత సైనికులను కలిసినట్లు ట్విట్టర్ లో పేర్కొన్న విజయ్.. దీనికి సంబంధించిన ఫొటోల‌ను పోస్ట్ చేశారు. సరిహద్దుల్లో శత్రు భీకర పోరాట యోధులను కలుసుకున్నానని వెల్లడించారు. ఈ ఫోటోలలో వీడీ ఆర్మీ జాకెట్ ధరించి తుపాకీ చేతబట్టి కనిపించాడు.

ప్రముఖ నేషనల్ మీడియా ఛానల్ ప్ర‌త్యేకంగా చేపట్టిన జైవాన్ కార్య‌క్ర‌మంలో భాగంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ దేశ స‌రిహ‌ద్దులో డ్యూటీ చేస్తున్న జవాన్లను కలుసుకునట్లు తెలుస్తోంది. సైనికుల విధి విధానాలు, సాధ‌క‌బాధ‌ల‌ను గురించి తెలుసుకున్నారు.

అలానే ఆర్మీ ఫైరింగ్ రేంజ్ లో గన్ పేల్చడం గురించి సైనికులను అడిగి తెలుసుకున్నారు. విజయ్'D షేర్ చేసిన ఫోటోలలో టార్గెట్ బోర్డుపై తుపాకీ ఎక్కుపెట్టడాన్ని మనం గమనించవచ్చు. ఈ సందర్భంగా జవాన్లు అందరూ వీడీ ని అభినందించినట్లు తెలుస్తోంది. 'జై జవాన్' కార్యక్రమం త్వరలోనే టెలికాస్ట్ కాబోతోంది.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'ఖుషి' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఉంటుందని తెలుస్తోంది. అలానే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'జనగణమన' (JGM) అనే మిలిటరీ బ్యాక్ డ్రాప్ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. అయితే 'లైగర్' ప్లాప్ తో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వస్తున్నాయి.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన 'లైగర్' మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా తెరకెక్కింది. ఈ మూవీ నిరాశ పరచడంతో.. విజయ్ దేవరకొండ ఇప్పుడు 'ఖుషి' చిత్రంతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని బాగా కష్టపడుతున్నాడు.