Begin typing your search above and press return to search.
టైటిల్ లాంచ్: 'వరల్డ్ ఫేమస్ లవర్' ఎవరు?
By: Tupaki Desk | 17 Sep 2019 6:00 AM GMTవిజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న 9వ సినిమా(VD9) టైటిల్ సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. `వరల్డ్ ఫేమస్ లవర్` అంటూ క్రియేటివ్ కమర్షియల్స్ బృందం టైటిల్ ని అధికారికంగా ప్రకటించింది. క్రాంతి మాధవ్ మార్క్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కాస్తంత పోష్ స్టైల్ తో టైటిల్ ని ఎంపిక చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో లవ్ స్టోరిలో సంథింగ్ ఏదో కొత్తదనం దాగి ఉందని.. టైటిల్ `వరల్డ్ ఫేమస్ లవర్` అని నిన్ననే `తుపాకి`లో రివీల్ చేశాం. తాజాగా ఆ టైటిల్ నే చిత్రబృందం కన్ఫామ్ చేయడం విశేషం.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. తేజ్ ఐ లవ్ యు లాంటి క్లాసిక్ టైటిల్స్ తరహాలో కాకుండా కాస్తంత యూనివర్శల్ యాటిట్యూడ్ ని జోడించాలనే ఈ టైటిల్ ని ఎంపిక చేసుకున్నారా? అంటే అవుననే అర్థమవుతోంది. వరల్డ్ ఫేమస్ అనగానే యూనివర్శల్ అప్పీల్ వచ్చింది. ఇప్పటికే విజయ్ దేవరకొండను పాన్ ఇండియా హీరోగా చూడాలన్న తాపత్రయం అభిమానుల్లో ఉంది. దాంతో కరణ్ జోహార్ లాంటి టాప్ డైరెక్టర్ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న దేవరకొండ హిందీ మార్కెట్ పైనా కన్నేసిన సంగతి తెలిసిందే. ఈ గేమ్ ప్లాన్ వల్లనే ఇప్పుడిలా `వరల్డ్ ఫేమస్` అంటున్నారా? ఏమో.. ఏదైతేనేం టైటిల్ ఆకట్టుకుంది. ఇక కంటెంట్ తో మెప్పించాల్సి ఉంటుంది. వరల్డ్ వైడ్ హిట్టివ్వాలంటే అందుకు తగ్గ కథ-కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో మెగా నిర్మాత కె.ఎస్.రామారావు చాలానే జాగ్రత్తలు తీసుకుని ఉంటారు. అయితే ఇటీవల ఆయన తానొకటి తలిస్తే అన్న చందంగా ఏ కథను ఎంచుకున్నా అది క్లాసిక్ గా ఉంటోంది తప్ప.. కమర్షియల్ హిట్టు మాత్రం కొట్టడం లేదు. అందుకే ఈసారి దేవరకొండ విషయంలో ఏం జరుగుతోందో అన్న క్యూరియాసిటీ పెరిగింది.
గోపిసుందర్ సంగీతం ఈ సినిమాకి పెద్ద ప్లస్ కానుంది. రాశీఖన్నా- ఐశ్వర్యా రాజేశ్- క్యాథరిన్- ఇజబెల్లిలు తదితరులు ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పూరితో ఫైటర్ అనే చిత్రంలో నటించనున్నారు దేవరకొండ. అలాగే మైత్రి సంస్థలో `హీరో` పెండింగులో ఉన్న సంగతి తెలిసిందే.