Begin typing your search above and press return to search.
బాలీవుడ్ లో దేవరకొండ.. ప్చ్ కష్టమే
By: Tupaki Desk | 15 Dec 2017 5:54 PM GMTప్రతి హీరో తన కెరీర్ లో ఏదైనా ఒక్క సినిమా మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉండాలని అనుకుంటాడు. చాలా మంది హీరోలు అలాంటి సినిమాల్లో అవకాశం దక్కించుకోవడానికి చాలా కాలమే పడుతుంది. ఒకవేళ అలాంటి సినిమా వచ్చింది అని తాను చెప్పుకొని నటించినా కూడా ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోతేనే ఆ సినిమాకి అసలైన విలువ. అలాంటి కథల కోసం మన టాలీవుడ్ హీరోలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ అతి తక్కువ కాలంలో మొదటి అడుగుల్లోనే లైఫ్ లాంగ్ గుర్తుండి పోయే హిట్ అందుకున్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. జనాల మదిలో కూడా ఆ సినిమా పాతుకుపోయింది. స్టార్ హీరోల లెవల్లో హిట్ అందుకున్న విజయ్ ఇప్పుడు మంచి ఆఫర్స్ అందుకుంటున్నాడు. అంతే కాకుండా రీసెంట్ గా బాలీవుడ్ నుంచి కూడా మనోడు ఓ మూడు ఆఫర్స్ ను అందుకోగా.. అదికూడా ప్రముఖ యశ్ రాజ్ ఫిల్మ్ సంస్థ వారిది అవ్వగా.. దానిని వద్దనుకుంటున్నాడట.
విజయ్ దేవరకొండ అభిమానులు బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సత్తా చాటగలడు అని కామెంట్స్ చేస్తున్న వేళ.. మనోడు మాత్రం యశ్ రాజ్ వారు మూడు సినిమా డీల్ సైన్ చేయమంటే.. వరుసగా అన్నంటే కష్టం అనుకుని.. ఆ డీల్ నుండి వెనకడుగు వేశాడట. ఒక్కసారి యశ్ రాజ్ తో అలాంటి డీల్ చేస్తే.. వారి మూడు సినిమాలు అయ్యేవరకు వేరే సినిమాలు చేయడానికి లేదు. గతంలో నుష్క శర్మ - పరిణితి చోప్రా వంటి హీరోయిన్స్.. రణవీర్ సింగ్ వంటి హీరో ఇటువంటి ఆఫర్లను దక్కించుకుని పెద్ద స్టార్లే అయ్యారు కాని.. మన సౌత్ వారు మాత్రం కాలేదు.