Begin typing your search above and press return to search.

విజయ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడట

By:  Tupaki Desk   |   27 Jun 2018 5:26 AM GMT
విజయ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడట
X
పెళ్లి చూపులు సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని ఆకర్షించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ నెక్స్ట్ మరో డిఫెరెంట్ కథతో రాబోతున్న సంగతి తెలిసిందే. సురేష్ బాబు ప్రొడక్షన్ లో ఈ నగరానికి ఏమైంది. అనే సినిమా శుక్రవారం రిలిజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే వైరల్ అయ్యింది. చూస్తుంటే ఈ సినిమాతో కూడా తరుణ్ భాస్కర్ కొత్త తరహాలో హిట్ అందుకునేలా ఉన్నాడనిపిస్తోంది. అయితే ఈ సినిమాలో ఒక హీరో గెస్ట్ రోల్ ఉంటుందట.

పెళ్లి చూపులు సినిమాతో తనకు మంచి హిట్ ఇచ్చాడని ఆ దర్శకుడి కోసం విజయ్ ఈ నగరానికి ఏమైంది అనే సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్నాడట. అర్జున్ రెడ్డి సినిమా తరువాత మనోడి రేంజ్ బాగా పెరిగిపోయింది. మహానటి సినిమా కోసం కూడా విజయ్ ను వాడేశారు. ఆ సినిమాకు ఎంతో కొంత ఉపయోగపడ్డాడు అని చెప్పాలి. ఇక ఇందులో కొంచెం సేపు నవ్వించి పాత్రలో కనిపిస్తాడట. ఆ కొన్ని నిమిషాలు థియేటర్ లో అరుపులే అని తెలుస్తోంది.

ఇక సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. కామెడీ డ్రామ గా రానున్న ఈ సినిమాలో పూర్తిగా కొత్త నటి నటులు కనిపించనున్నారు. విశ్వఖ్, అనీషా ఆంబ్రోస్, సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కాకుమను, అభినవ్ గౌతమ్ మరియు సిమ్రాన్ చౌదరి సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు.