Begin typing your search above and press return to search.

క‌ర్లీ హెయిర్ తో గ్రీకువీరుడిలా దిగిన రౌడీ

By:  Tupaki Desk   |   24 Oct 2020 9:00 AM IST
క‌ర్లీ హెయిర్ తో గ్రీకువీరుడిలా దిగిన రౌడీ
X
క‌ర్లీ హెయిర్ తో .. 6 ప్యాక్ యాబ్స్ తో స‌రికొత్త రూపాన్ని త‌యారు చేశాడు రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. పాన్ ఇండియా మూవీ ఫైట‌ర్ మ‌హ‌త్మ్య‌మో.. పూరి జ‌గ‌న్నాథ్ ఒత్తిడి ఫ‌లిత‌మో కానీ మొత్తానికి ఈ మేకోవ‌ర్ గాళ్స్ కి పిచ్చిగా న‌చ్చేసింది. రౌడీ వేర్ పేరుతో ఫ్యాష‌న్స్ ప‌రంగానూ దుమారం రేపుతూ యూత్ లో నిరంత‌రం హాట్ టాపిక్ గా మారాడు. క‌ర‌ణ్ జోహార్ ... మ‌ల్హోత్రా బృందం అత‌డిని ఫైట‌ర్ మూవీలో స‌రికొత్త‌గా ఆవిష్క‌రించేందుకు గ‌ట్టిగానే సాన‌బ‌డుతున్నారు.

ఇక ఇటీవ‌లే ఐరోపాకు జంప్ అయిపోయిన దేవ‌ర‌కొండ అక్క‌డ ఆహ్లాదకరమైన వాతావ‌ర‌ణంలో న‌చ్చిన‌ ఆహారాన్ని ఆస్వాదించడానికి వెళ్లాడ‌ట‌. తాజాగా దేవ‌ర‌కొండ‌ తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో ఇదిగో ఇలా దొరికిపోయాడు. బ్లాక్ ట్రాక్ ప్యాంటు.. నియాన్ గ్రీన్ టీ షర్టు ధరించి విజయ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తున్నాడు. అత‌డి క‌ర్లీ హెయిర్ లుక్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారింది.

ఈ లుక్ చూశాక ఐరోపా నుంచి రాకుమారుడిలా దిగాడు! అంటూ యూత్ ఒక‌టే వ్యాఖ్యానంతో హీటెక్కిస్తున్నారు. ‘ఫైటర్’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని అతని అభిమానులు ఆశిస్తున్న వేళ సెట్స్ లో జాయిన్ అయ్యేందుకే ఇలా దిగిపోయాడా? అన్నది త‌నే చెప్పాలి.