Begin typing your search above and press return to search.
ఇంకా అర్జున్ రెడ్డి స్టయిలేనా?
By: Tupaki Desk | 3 May 2018 4:26 AM GMTయంగ్ హీరో విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఈ సినిమాల్లో కొన్ని డైలాగులను సెన్సార్ బీప్ చేసింది. కానీ విజయ్ దేవరకొండ మాత్రం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ మాటలను యథేచ్ఛగా వాడేశాడు. తాను గట్టిగా అరిచిచెప్పడమే కాదు.. అందరితోనూ అనిపించాడు.
బేసిగ్గా విజయ్ ఏ పబ్లిక్ ఈవెంట్ లో మాట్లాడినా చాలా బోల్డ్ గా మాట్లాడతాడు. మనసులో ఏదీ దాచి పెట్టుకున్నట్టుగా కనిపించడు. కాలేజ్ లో కుర్రాళ్లు ఎలా మాట్లాడేస్తారో... సింపుల్ గా అదే మాట్లాడేస్తాడు. యూత్ విజయ్ కు కనెక్ట్ అవడానికి ఇదీ ఓ కారణమని చెప్పాలి. కానీ పబ్లిక్ ఈవెంట్లో ఇబ్బంది ఎవరినీ నొప్పించకుండా మాట్లాడితేనే బాగుంటుందనే విషయంపై విజయ్ దృష్టి పెట్టడం లేదు. తాజాగా మహానటి ఆడియో రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ తన స్పీచ్ మొదట్లోనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ను ఉద్దేశించి ‘‘యు హావ్ గాట్ బాల్స్ మేన్’’ అనేశాడు. ఈ మాట ఈవెంట్ కు అటెండయిన వారిలో చాలామందిని అవాక్కయేలా చేసింది.
తరవాత సినిమాలో కో స్టార్ల గురించి మాట్లాడే టైంలో హీరోయిన్ సమంతకు ఆమె భర్త నాగచైతన్య తరవాత ఇష్టపడేది తననేనంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. హీరోగా ఇమేజ్ లేని టైంలో విజయ్ బోల్డ్ గా మాట్లాడినా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న యంగ్ హీరో. తాను మాట్లాడే తీరు బాగుంటుందని అందరూ ఒప్పుకుంటారు. కానీ సెన్సార్ వర్క్స్ కూడా కాస్త గుర్తు పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందేమో..