Begin typing your search above and press return to search.
#INSTAలో సూపర్ స్టార్ నే వెనక్కి నెట్టాడు
By: Tupaki Desk | 16 Dec 2019 10:22 AM GMTరౌడీ విజయ్ దేవరకొండ హవా ఏ రేంజులో సాగుతోందో చెప్పేందుకు ఇదిగో ఇదే నిదర్శనం. స్టార్లు.. సూపర్ స్టార్లనే మన రౌడీ కిందికి నెట్టేశాడు. సోషల్ మీడియా రేసులో సత్తా చాటాడు. సూపర్ స్టార్ మహేష్ ... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లను వెనక్కి నెట్టి ఇన్ స్టాలో గ్రేట్ హీరో అనిపించుకున్నాడు.
తాజా ఇన్ స్టా గణాంకాల ప్రకారం.. మహేష్ కు 38లక్షల (3.8 మిలియన్) మంది ఫాలోవర్స్ ఉండగా.. అల్లు అర్జున్ కి 46లక్షల (4.6 మిలియన్) మంది ఇన్ స్టా ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఇద్దరినీ డామినేట్ చేస్తూ విజయ్ దేవరకొండ ఏకంగా 50లక్షల (5 మిలియన్స్) ఫాలోవర్స్ ని సాధించాడు. 7 మార్చ్ 2018 న ఇన్ స్టాలో ఖాతాను ప్రారంభించిన విజయ్ దేవరకొండ రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే ఇంత రేంజులో ఫాలోయింగ్ సంపాదించడం ఆసక్తికరం.
ఓవైపు సినిమాలు.. మరోవైపు రౌడీ బ్రాండ్ వ్యాపారం అంటూ దేవరకొండ చేస్తున్న హంగామా మామూలుగా లేదు. రొటీన్ హీరోలకు దూరంగా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేక పంథా ఉందని నిరూపించాడు. అర్జున్ రెడ్డి- గీత గోవిందం- ట్యాక్సీవాలా అంటూ బ్లాక్ బస్టర్లు అందుకోవడంతో అతడి ఫాలోయింగ్ మామూలుగా లేదు. అర్జున్ రెడ్డి ఇరుగు పొరుగు భాషల్లో రీమేకవుతుండడంతో విజయ్ గురించి అన్ని భాషల్లోనూ అందరూ తెలుసుకుంటున్నారు. అతడు నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్లో ఇరుగు పొరుగునా రిలీజవుతుండడడం .. మెట్రోల్లో అతడి స్టైల్ కి ప్రత్యేకించి యూత్ లో ఫాలోవర్స్ ఏర్పడడం వెరసి విజయ్ కి ఇంత ఫాలోయింగ్ దక్కిందని అంచనా వేస్తున్నారు. ఇక టాలీవుడ్ లోనే ఫ్యాషన్ అనుకరణలో మరో రణవీర్ సింగ్ తరహాలో విజయ్ చేస్తున్న ప్రయోగాలు అతడికి విపరీతంగా ఫాలోయింగ్ ని పెంచుతున్నాయంటే అతిశయోక్తి కాదు.