Begin typing your search above and press return to search.

కామ్రేడ్ సీరియసా రొమాంటికా?

By:  Tupaki Desk   |   18 March 2019 7:36 AM GMT
కామ్రేడ్ సీరియసా రొమాంటికా?
X
మొదట్లో డియర్ కామ్రేడ్ అనే టైటిల్ విన్నప్పుడు ఇది చాలా సీరియస్ గా సాగే థీమ్ తో విద్యార్ధి రాజకీయాల నేపథ్యంలో ఉంటుందనే అందరూ ఆశించారు. కానీ నిన్న విడుదలైన టీజర్ చూశాక కొత్త అనుమానాలు రేకెత్తాయి. నిజానికి కామ్రేడ్ అనే పదం విప్లవాత్మక భావాలు కలిగి పోరాటాలకు సిద్ధపడ్డ సహచరులను పిలిచే పేరు. స్టూడెంట్ యూనియన్స్ తో పాటు నక్సలైట్ గ్రూప్స్ లో కూడా ఈ పదాన్ని విరివిగా వాడుతుంటారు.

కాని టీజర్ షాట్ లో ఆవేశంగా విజయ్ దేవరకొండ ఒకడి మొహం పగలగొట్టడంతో పాటు హీరోయిన్ రష్మిక మందన్నను లిప్ టు లిప్ కిస్ చేయడం సోషల్ మీడియాలో మాములు వైరల్ అవ్వలేదు. దీని మీద డిస్కషన్స్ కూడా మొదలయ్యాయి. అయితే డియర్ కామ్రేడ్ లో ఎంత మోతాదులో సీరియస్ నెస్ ఉంటుంది ఎంత పాళ్లల్లో ప్రేమ కథను మిక్స్ చేశారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇలా కామ్రేడ్ అనే పేరు పెట్టి మూతి ముద్దులు చూపిస్తారా అంటూ అడుగుతున్న వారు లేకపోలేదు.

సబ్జెక్ట్ డిమాండ్ అని చెప్పుకోవచ్చు గాక కానీ అవి లేకుండా విజయ్ దేవరకొండ సినిమా ఉండదు అనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో కలిగించే ప్రయత్నం అయితే కనిపిస్తోంది. కామ్రేడ్ అంటే అంచనాలు వేరుగా ఉంటాయి. ఇదే సినిమాకు డియర్ లవర్ అని పేరు పెట్టి ఇదే టీజర్ ను చూపిస్తే అసలీ చర్చే ఉండదు. కానీ కామ్రేడ్ అనే శక్తివంతమైన పదం ఉంది కాబట్టే విజయ్ దేవరంకొండ యాక్షన్ బిట్ కన్నా కిస్ హై లైట్ అయ్యింది. దర్శకుడు భరత్ కమ్మనే దీనికి క్లారిటీ ఇస్తే బెటర్