Begin typing your search above and press return to search.
తుని ఘటనతో కామ్రేడ్ లింకు?
By: Tupaki Desk | 6 Nov 2018 6:30 AM GMTరత్నాచల్ ఎక్స్ ప్రెస్ దుర్ఘటన తర్వాత తుని నగరానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు తుని(తూ.గో జిల్లా) చుట్టుపక్కల అందమైన హిల్ ఏరియాలో - తాండవ నది పరిసరాల్లోని రకరకాల లొకేషన్లలో ఎన్నో షూటింగులు జరిగినా వాటికి అంతగా ప్రచారం రాలేదు. కానీ ఇటీవలి కాలంలో తుని పరిసరాల్లో షూటింగుల విస్తృతి పెరిగిందన్న మాట వినిపిస్తోంది. అప్పట్లో తాతినేని సత్య అనే తుని ఏరియాకి చెందిన దర్శకుడు అక్కడే తన సినిమా పూర్తి షూటింగ్ చేశాడు. ఆ క్రమంలోనే గోదావరి జిల్లాల దర్శకనిర్మాతలు తునికి షూటింగుల పరంగా ప్రాధాన్యతను పెంచారు. తునికి 90కిలో మీటర్ల దూరంలో ఉండే అరకులో షూటింగులు పూర్తి చేసుకుని - ఈ ఏరియాలోనూ కొంత మేర షూటింగులు చేయడం చర్చకొచ్చింది. పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్ తుని-నర్సీపట్నం ఏరియా నుంచి వచ్చారు కాబట్టి తునికి ఆ మేరకు పరిశ్రమలో ఐడెంటిటీ ఉంది.
తాజాగా ఈ ఏరియాలో విజయ్ దేవరకొండ `డియర్ కామ్రేడ్` షూటింగ్ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఇక్కడ పరిసర గ్రామాల్లో ప్రత్యేకించి షూటింగ్ ప్లాన్ చేయడంతో `తుని`కి ప్రత్యేకంగా పాపులారిటీ పెరుగుతోంది. దేవరకొండకు నైజాంతో పాటు తుని నుంచి వైజాగ్ వరకూ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. తుని-పాయకరావు పేట మాస్ థియేటర్లలోనూ `గీత గోవిందం` అద్భుత కలెక్షన్లతో రికార్డ్ స్థాయిలో ఆడిందని ఇదివరకూ ట్రేడ్ రిపోర్ట్ పేర్కొంది. అందుకే ఇప్పుడు తుని ఏరియాలో `డియర్ కామ్రేడ్` షూటింగ్ చేస్తుండడంతో దేవరకొండ అభిమానులు ఆ పరిసరాల్లో షూటింగ్ వీక్షించేందుకు వస్తున్నారట.
ప్రస్తుతం దేవరకొండ ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్. ఇంకొకటి క్రాంతి మాధవ్ - కె.ఎస్.రామారావు కాంబినేషన్ లో సినిమా ఆన్ సెట్స్ ఉన్నాయి. ఇప్పటికే `డియర్ కామ్రేడ్` చిత్రం సగం టాకీ పూర్తయింది. `పెళ్లి చూపులు` సహనిర్మాత యశ్ రాగినేనికి చెందిన బిగ్ బెన్ సినిమాస్ మైత్రి సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గీత గోవిందం ఫేం రశ్మిక మందన మరోసారి దేవరకొండ సరసన నటిస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ నటించిన `ట్యాక్సీ వాలా` నవంబర్ 17న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.