Begin typing your search above and press return to search.

నిర్మాతను ఫిదా చేసిన విజయ్ దేవరకొండ.. ఎలాగంటే?

By:  Tupaki Desk   |   28 Jan 2021 4:35 PM GMT
నిర్మాతను ఫిదా చేసిన విజయ్ దేవరకొండ.. ఎలాగంటే?
X
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. డాషింగ్ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ తో కలిసి లైగర్ అనే పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ పూరీ.. హీరోలను డిఫరెంట్ గా చూపించడంలో దిట్ట. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ పై అభిమానులలో అంచనాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. మొదటి నుండి ఈ కాంబినేషన్ సినిమాకి ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ నామమాత్రంగా పాపులర్ అయింది. కానీ ఇటీవలే పూరీ ఈ సినిమా అసలు టైటిల్ 'లైగర్' అంటూ అధికారికంగా ప్రకటించి ఖుషి చేసాడు. పూరీ కనెక్ట్స్ అండ్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఛార్మి సహానిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమాలో అనన్యపాండే హీరోయిన్ నటిస్తోంది. ఈ సినిమాతో విజయ్‌ బాలీవుడ్ ఇండస్ట్రీకి, అనన్య పాండే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒకేసారి లాంచ్ అవుతున్నారు. అయితే విజయ్ దేవరకొండకు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ముఖ్యంగా విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టైల్ కి యువత ఫిదా అయిపోతుంటారు. అప్పుడప్పుడు ఇండస్ట్రీకి చెందిన పెద్దలకు, హీరోలకు విజయ్ స్పెషల్ గా డ్రెస్సెస్ తయారు చేయించి బహుమతిగా పంపిస్తుంటాడు. అలాగే తాజాగా తన నిర్మాత మనసు గెలుచుకున్నాడు విజయ్. ధర్మ ప్రొడక్షన్స్ అధినేత, లైగర్ సినిమా నిర్మాత కరణ్ జోహార్ కు ఓ స్పెషల్ డెనిమ్ జాకెట్ ఒకటి డిజైన్ చేయించి బహుమతిగా పంపించాడట. అంతే డ్రెస్సింగ్ లో కొత్త కొత్త ట్రెండ్స్ ఫాలో అయ్యే కరణ్ జోహార్.. విజయ్ పంపిన కొత్త జాకెట్ చూసి ఫిదా అయిపోయాడట. ఇంకేముంది ఆ జాకెట్ పిక్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అంతే అలా విజయ్ పంపిన న్యూ స్టైల్ ఇండస్ట్రీ మొత్తం ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా విజయ్ లైగర్ మూవీ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది.