Begin typing your search above and press return to search.

పవన్‌ - మహేష్‌ ల ఫలితమే దేవరకొండకు కూడా!

By:  Tupaki Desk   |   8 Oct 2018 6:18 AM GMT
పవన్‌ - మహేష్‌ ల ఫలితమే దేవరకొండకు కూడా!
X
తెలుగు సినిమా పరిశ్రమలో ఇతర భాషల టెక్నీషియన్స్‌ లెక్కకు మించి ఉంటారు. పలువరు స్టార్‌ హీరోలు తమిళ దర్శకులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన విషయం తెల్సిందే. తెలుగులో సినిమాలు చేసిన తమిళ దర్శకులు ఎక్కువ శాతం నిరాశ పర్చారు. అయితే కొందరు మాత్రం కొన్ని సార్లు సక్సెస్‌ లను దక్కించుకున్నారు. తెలుగు స్టార్‌ హీరోలు పవన్‌ కళ్యాణ్‌ మరియు మహేష్‌ బాబులు తమిళ హీరోల వల్ల తీవ్రంగా భంగపాటుకు గురయ్యారు. తాజాగా వారి దారిలోనే విజయ్‌ దేవరకొండ కూడా ‘నోటా’తో నిరాశ పర్చాడు.

పవన్‌ కళ్యాణ్‌ తమిళ దర్శకుడు ఎస్‌ జే సూర్య తో ‘ఖుషి’ చిత్రం చేసి సక్సెస్‌ ను దక్కించుకున్నాడు. కాని ఆ తర్వాత ‘బంగారం’ - ‘పంజా’ - ‘కొమరం పులి’ చిత్రాలను తమిళ దర్శకులతో చేసి భారీ ఫ్లాప్స్‌ ను మూట కట్టుకున్న విషయం తెల్సిందే. తమిళ దర్శకులు అంటేనే ఆ తర్వాత పవన్‌ వెనుకంజ వేశాడు. పవన్‌ తర్వాత మహేష్‌ బాబు కూడా ‘నాని’ మరియు ‘స్పైడర్‌’ చిత్రాలతో ఫ్లాప్‌ లను చవి చూశాడు. ఈ రెండు సినిమాలు కూడా తమిళ దర్శకుల దర్శకత్వంలోనే మహేష్‌ చేసిన విషయం తెల్సిందే. తాజాగా తమిళ దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో విజయ్‌ ‘నోటా’ చేశాడు.

‘పెళ్లి చూపులు’ - ‘అర్జున్‌ రెడ్డి’ - ‘గీత గోవిందం’ చిత్రాలను తెలుగు దర్శకులతో చేసి సక్సెస్‌ లను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ ‘నోటా’ చిత్రాన్ని మాత్రం తమిళ దర్శకుడితో చేసి నిరాశ పర్చాడు. గీత గోవిందం చిత్రంతో వచ్చిన క్రేజ్‌ వల్ల ‘నోటా’కు మంచి ఓపెనింగ్స్‌ వచ్చాయి, కాని ఫుల్‌ రన్‌ లో ఈ చిత్రం అంతగా రాణించలేక పోతుందనే టాక్‌ వినిపిస్తుంది. ఈలోపు ‘అరవింద సమేత’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. దాంతో ‘నోటా’ పూర్తిగా డ్రాప్‌ అవ్వాల్సి రావచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.