Begin typing your search above and press return to search.
దేవరకొండ అయినా సాధిస్తాడా!?
By: Tupaki Desk | 27 April 2018 10:47 AM GMTదక్షిణాది మొత్తంలో హీరోగా గుర్తింపు సాధించడం అనే ఫీట్.. ఇప్పటివరకూ ఏ తెలుగు హీరోకు సాధ్యం కాలేదు. చాలామంది హీరోలు ఈ విషయంలో గట్టి ప్రయత్నాలు చేశారు కానీ.. అల్లు అర్జున్ మాత్రం మలయాళంలో మార్కెట్ దక్కించుకోగలిగాడు. ప్రస్తుతం ప్రభాస్ కు బాహుబలి కారణంగా పాన్ ఇండియా క్రేజ్ ఏర్పడినా.. తర్వాతి సినిమా సక్సెస్ ను అనుసరించి మాత్రమే అక్కడ హీరోగా ఏ మాత్రం సెటిల్ అయ్యాడో తెలుస్తుంది.
నాని.. శర్వానంద్.. సందీప్ కిషన్ లాంటి కుర్ర హీరోలు కూడా ఈ విషయంలో ట్రయల్స్ వేసినా సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ మాత్రం.. దక్షిణాది మొత్తంలో మార్కెట్ విస్తరించుకునేందుకు గట్టి ప్లాన్స్ నే వేసుకున్నాడు. హీరోగా మాంచి క్రేజ్ ఉన్నా.. ఇప్పుడు రిలీజ్ కానున్న మహానటి మూవీలో సపోర్టింగ్ రోల్ చేయడమే ఇందుకు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. తెలుగుతో పాటు తమిళ్.. మలయాళంలో కూడా మహానటి విడుదల కానుంది.
దీంతో పాటు నోటా అనే టైటిల్ తో రూపొందుతున్న తమిళ్ మూవీలో కూడా నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇది తెలుగులో కూడా విడుదల అవుతోంది. తెలుగులో కనీసం ఓ 20 కోట్ల వరకూ మార్కెట్ ఉన్న విజయ్ దేవరకొండ.. ఇతర భాషల్లో కూడా విస్తరించడం ద్వారా మరో 10-15 కోట్ల మార్కెట్ ను టార్గెట్ చేశాడని.. అందుకే ఇలా మల్టీ లాంగ్వేజ్ మూవీస్ ఎంచుకుంటున్నాడని సన్నిహితులు చెబుతున్నారు.