Begin typing your search above and press return to search.

VD ఫ్యాన్స్ ఆశలన్నీ ఇప్పుడు ఆ సినిమాపైనే..!

By:  Tupaki Desk   |   29 Aug 2022 5:49 AM GMT
VD ఫ్యాన్స్ ఆశలన్నీ ఇప్పుడు ఆ సినిమాపైనే..!
X
'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి డిజాస్టర్ తర్వాత సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాస్త గ్యాప్ తీసికొని చేసిన ''లైగర్'' సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచింది.

'లైగర్' ఫలితంతో రౌడీ ఫ్యాన్స్ తీవ్రంగా కలత చెందారు. ఇండియా మొత్తం షేక్ అవుతుందనుకుంటే.. రెండో రోజు నుంచే థియేటర్లు ఖాళీగా కనిపించే పరిస్థితి రావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయ్ వీలైనంత త్వరగా దీన్నుంచి బయటపడి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

VD నటిస్తున్న 'జనగణమన' మరియు 'ఖుషీ' సినిమాలు సెట్స్ మీదున్నాయి. వీటిల్లో ముందుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో విజయ్ సరసన సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటిస్తోంది.

'లైగర్' సినిమా దారుణ పరాజయం చవిచూడటంతో ఇప్పుడు 'ఖుషి' చిత్రంపైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. 'మహానటి' తర్వాత విజయ్ దేవరకొండ మరియు సమంత కలిసి మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తారని భావిస్తున్నారు.

విడాకుల ప్రకటన తర్వాత సమంత నటిస్తున్న రొమాంటిక్ మూవీ 'ఖుషి'. గతంలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఆమె 'మజిలీ' వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించింది. ఇప్పుడు విజయ్ తో కలిసి మ్యాజికల్ కెమిస్ట్రీని పంచుకుంటుందని.. ఇది రౌడీ హీరోకి సానుకూలమైన ఫలితాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు. సెన్సిబుల్ లవ్ స్టోరీలకు పేరుగాంచిన దర్శకుడు కచ్చితంగా సక్సెస్ ఇస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'ఖుషి' ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళం - మలయాళం - కన్నడ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఇప్పటికే రెండు కీలక షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేశారు. కొత్త షెడ్యూల్ ను ప్రారంభించేందుకు వీడీ సిద్ధమవుతున్నాడు. హైదరాబాద్ - వైజాగ్ - అల్లెప్పి లలో చిత్రీకరణ జరుపనున్నారని తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2022 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న సినిమాని రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి రాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీని తర్వాతే పూరీ జగన్నాథ్ - విజయ్ కాంబోలో 'JGM' అనే పాన్ ఇండియా మూవీ రాబోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.