Begin typing your search above and press return to search.
'ఫైటర్' నిర్మాణంలో బాలీవుడ్ స్టార్ నిర్మాత
By: Tupaki Desk | 20 Jan 2020 6:24 AM GMTవిజయ్ దేవరకొండ 10వ చిత్రం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం ప్రకటన వచ్చి చాలా రోజులు అయ్యింది. ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఒక వైపు వరల్డ్ ఫేమస్ లవర్ మరియు మరో వైపు బాడీ బిల్డింగ్ కోసం టైం తీసుకున్న విజయ్ దేవరకొండ 'ఫైటర్' మూవీకి రెడీ అయ్యాడు. నేడు ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు లాంచనంగా జరిగాయి. అయితే షూటింగ్ ప్రారంభం రోజు సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి క్లారిటీ వచ్చింది.
ఈ సినిమా టైటిల్ ఫైటర్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఇంకా ఆ విషయమై క్లారిటీ రాలేదు. కాని నిర్మాతల విషయంలో అనూహ్యమైన ట్విస్ట్. ఈ చిత్రంను పూరి జగన్నాధ్ మరియు ఛార్మిలతో పాటు కరణ్ జోహార్ కూడా నిర్మించబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ అయిన కరణ్ జోహార్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అవ్వడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేస్తారా లేదంటే కరణ్ జోహార్ కు విజయ్ పై చాలా అభిమానం ఉంది. ఆ అభిమానంతో ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది.
గతంలో కరణ్ జోహార్ బ్యానర్ ధర్మా ప్రొడక్షన్స్ లో విజయ్ దేవరకొండ ఒక హిందీ సినిమాను చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. పలు సార్లు కరణ్ జోహార్ పార్టీల్లో మరియు కార్యక్రమాల్లో విజయ్ దేవరకొండ పాల్గొన్నాడు. అలా ఇద్దరి మద్య సన్నిహిత్యం ఏర్పడింది. ఆ సన్నిహిత్యంతో తన సినిమా నిర్మాణం లో కరణ్ జోహార్ ను కూడా భాగస్వామిగా విజయ్ దేవరకొండ మార్చేశాడు. కరణ్ జోహార్ బ్రాండ్ ఇమేజ్ తో ఉత్తరాధినే కాకుండా ఇక్కడ కూడా సినిమా కు మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది.
నేడు పూజా కార్యక్రమాలు జరిపిన చిత్ర యూనిట్ సభ్యులు రెగ్యులర్ షూటింగ్ కూడా నేటి నుండే జరుపుతున్నారట. ముంబయిలో మొదటి షెడ్యూల్ చిత్రీకరణ జరుపబోతున్నారు. పూరి చాలా స్పీడ్ గా సినిమాలను తీస్తాడు కనుక సమ్మర్ చివరి వరకు సినిమాను విడుదల చేస్తాడేమో చూడాలి.