Begin typing your search above and press return to search.

ఏకంగా సమంత పక్కన హీరో అనమాట

By:  Tupaki Desk   |   11 April 2018 4:49 AM GMT
ఏకంగా సమంత పక్కన హీరో అనమాట
X
పెళ్లి చూపులు.. అర్జున్ రెడ్డి చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండకు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. కుర్రాడి ట్వీట్స్ కు.. కొత్త సినిమా ప్రమోషన్ మెటీరియల్ కు వస్తున్న రెస్పాన్స్ ఇందుకు సాక్ష్యంగా చెప్పవచ్చు. డిఫరెంట్ క్యారెక్టర్లతో తన స్థాయి అంతకంతకూ పెంచుకుంటున్న విజయ్ దేవరకొండ.. ఇప్పుడు మహానటి మూవీ ద్వారా మే 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

మహానటి మూవీలో విజయ్ దేవరకొండ లుక్ ఎలా ఉంటుందో మేకర్స్ రిలీజ్ చేశారు. విజయ్ ఆంటోనీ అనే పాత్రలో కనిపించనుండగా.. 'నిజం ఎప్పుడూ అందంగానే ఉంటుంది మధురవాణి గారు' అని సమంత పాత్రతో విజయ్ దేవరకొండ మాట్లాడే మాటను పోస్టర్ మీద రాశారు. మహానటిలో ఈ యంగ్ హీరో నటిస్తున్నాడని ముందే తెలిసినా.. ఇప్పటివరకూ ఏఎన్నార్ పాత్రలో కనిపించబోతున్నాడనే టాక్ వినిపించింది. కానీ చైతుకు మహానటి టీం థ్యాంక్స్ చెప్పిన తర్వాత.. ఇది నిజం కాదని తెలిసిపోయింది.

పోస్టర్ లో ఓ స్కూటర్ నడుపుతున్న లుక్.. మెడలో వేలాడుతున్న కెమెరా చూస్తుంటే.. జర్నలిస్టుగా పని చేసే సమంతకు తోడుగా.. కెమెరా మ్యాన్ గా.. అదేనండీ ఫోటో జర్నలిస్టుగా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని అర్ధం చేసుకోవచ్చు. అంటే మూవీ అంతా సమంత క్యారెక్టర్ రీసెర్చ్ లో ఉన్నపుడల్లా విజయ్ ఆంటోనీగా విజయ్ దేవరకొండ కనిపిస్తాడన్న మాట. ఇద్దరూ కలిసే జర్నీ చేస్తారని.. ఓ రకంగా సమంత పోషించే మధురవాణి పాత్రకు బాయ్ ఫ్రెండ్ గా విజయ్ దేవరకొండ నటించాడని భావించచ్చు.