Begin typing your search above and press return to search.
నైజాం మెగాస్టార్ కి బిగ్ థ్రెట్
By: Tupaki Desk | 24 July 2018 4:20 AM GMTనైజాం మెగాస్టార్ గా నితిన్ కి ప్రత్యేకమైన క్రేజు ఉంది. ప్రతిభ పరంగా అతడికి ఎదురే లేదు. అయితే ఎంపిక చేసుకుంటున్న కథ - కంటెంట్ లో తేడా కొట్టడంతో అతడి కెరీర్ హిట్టు - ఫ్లాపు అన్న చందంగా గతుకుల రోడ్ లో ఉంది. ఇటీవల కొన్ని వరుస సక్సెస్ ల తర్వాత మళ్లీ లై రూపంలో ఫ్లాప్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే నైజాంలో అతడికి ఆల్టర్నేట్ హీరోగా విజయ్ దేవరకొండ తన కెరీర్ని బూస్టప్ చేసుకోవడం ప్రధానంగా ఫ్యాన్స్ లో చర్చకొచ్చింది. విజయ్ నటించిన సినిమాలన్నీ బంపర్ హిట్లే. ఎవడే సుబ్రమణ్యం - పెళ్లి చూపులు - అర్జున్ రెడ్డి - మహానటి ఇవన్నీ అతడికి బిగ్ బ్రేక్ ని ఇచ్చాయి. ఆ క్రమంలోనే అతడంటే ఫ్యాన్స్ లో క్రేజు అంతే వేగంగా పెరిగింది. ప్రస్తుతం నైజాంలో ఠఫ్ కాంపిటీషన్ ఈ ఇద్దరు హీరోల మధ్యనే అంటే అతిశయోక్తి కాదు.
సోషల్ మీడియా ట్రెండ్ లో నితిన్ని మించి దేవరకొండకు క్రేజు నెలకొనడం ప్రత్యేకంగా చర్చకొచ్చింది. అందుకు సింబాలిక్ గా రీసెంటుగా రిలీజైన ఆ ఇద్దరు హీరోల టీజర్ ల వ్యూస్ ని నెటిజనులు ఎగ్జాంపుల్ గా చెబుతున్నారు. నితిన్ నటించిన `శ్రీనివాస కళ్యాణం` టీజర్ ఈ ఆదివారం రిలీజై మిలియన్ ప్లస్ (10లక్షలు పైగా) వ్యూస్ దక్కించుకుంది. అదే రోజు రావాల్సిన దేవరకొండ `గీత గోవిందం` టీజర్ ఒకరోజు ఆలస్యంగా వచ్చింది. ఈ సోమవారం రిలీజైన ఈ టీజర్ కి కేవలం 18 గంటల్లోనే 2.8 మిలియన్ వ్యూస్ దక్కాయి. అంటే దాదాపు 28లక్షల వ్యూస్ కొన్ని గంటల్లోనే సాధ్యమైంది. ఇది సదరు హీరోల కెరీర్ గ్రాఫ్ కి సింబాలిక్ అని చెప్పొచ్చు. మొత్తానికి నైజాం మెగాస్టార్ కి దేవరకొండ రూపంలో థ్రెట్ మొదలైందనే దీనర్థం అంటూ విశ్లేషిస్తున్నారు. అయితే శ్రీనివాస కళ్యాణం చిత్రంతో హిట్టు కొట్టి నితిన్ తిరిగి తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడనే అభిమానులు ఆశిస్తున్నారు. ఆగస్టు 9న `శ్రీనివాస కళ్యాణం` రిలీజవుతుంటే, ఆగస్టు 15న గీత గోవిందం రిలీజవుతోంది.