Begin typing your search above and press return to search.
టాక్సీ వెనక్కి.. గోవిందం ముందుకి
By: Tupaki Desk | 22 Jun 2018 4:15 AM GMTఅర్జున్ రెడ్డి తో యూత్ లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. రీసెంట్ గా ఈ సినిమాలో నటనకు ఫిలిం ఫేర్ అవార్డ్ కూడా అందుకున్నాడు. అర్జున్ రెడ్డితో అలా లక్ కలిసొచ్చినా టైం మాత్రం ఈ యంగ్ హీరోకి కలిసిరావడం లేదు. అతడి సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఇంట్రస్ట్ గా ఎదురుచూస్తున్నా రిలీజ్ కు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి.
అర్జున్ రెడ్డి తరవాత విజయ్ దేవరకొండ గీతా ఆర్ట్స్ అండ్ యువీ క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో టాక్సీవాలా సినిమా చేశాడు. వాస్తవానికి ఈ మూవీ సమ్మర్ లోనే విడుదల కావాల్సి ఉంది. కనీసం జులై నాటికి వస్తుందనుకున్నా అదీ కుదిరేలా లేదు. దీంతో అతడు నటించిన గీత గోవిందంను ముందు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఛలో బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. గీతగోవిందం సినిమా కూడా గీతా ఆర్ట్స్ సంస్థే నిర్మించింది. టాక్సీవాలా రిలీజ్ కోసం అక్టోబర్ దాకా అగాల్సిన పరిస్థితి ఉండటంతో గీతగోవిందం రిలీజ్ చేయడమే బెటరని గీతా ఆర్ట్స్ టీం ఆలోచిస్తోంది.
టాక్సీ వాలా సినిమాలో గ్రాఫిక్ వర్క్ చాలా కీలకం. రిలీజ్ కు ముందు ఈ సినిమాలో గ్రాఫిక్స్ అనుకున్న క్వాలిటీతో రాలేదు. రషెస్ చూసుకున్నాక గీతా ఆర్ట్స్ తో పాటు యువీ క్రియేషన్స్ కు కూడా గ్రాఫిక్స్ ఏ మాత్రం నచ్చలేదు. దీంతో చెన్నైలోని ఇంకో సంస్థకు బాధ్యతలు అప్పగించారు. క్వాలిటీ కోసం గట్టి పట్టు పట్టడంతో సీజీ పనులు లేటవుతున్నాయి.