Begin typing your search above and press return to search.
విజయ్ దేవరకొండ టార్గెట్ ఎంత?
By: Tupaki Desk | 14 Aug 2018 8:47 AM GMTచాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘గీత గోవిందం’ భారీ అంచనాల మధ్య బుధవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రానికి పెద్ద స్టార్ హీరోల సినిమాలకున్నంత హైప్ కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఆ స్థాయిలోనే ఉన్నాయి. దీనికి ఓపెనింగ్స్ అనూహ్యంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇంత హైప్ తెచ్చుకున్న ఈ చిత్రానికి బిజినెస్ ఏ స్థాయిలో జరిగిందన్న ఆసక్తి కూడా అందరిలోనూ ఉంది. ‘అర్జున్ రెడ్డి’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల్లో కూడా దీనిపై బాగానే ఆసక్తి నెలకొంది. గీతా ఆర్ట్స్ ట్రాక్ రికార్డు.. ప్రమోషన్లు కూడా బాగా కలిసొచ్చి బిజినెస్ కొంచెం పెద్ద స్థాయిలోనే జరిగినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈ చిత్రానికి రూ.18 కోట్ల దాకా సమకూరినట్లు అంచనా.
కొన్ని ఏరియాల్ని అమ్మేసిన అల్లు అరవింద్.. కొన్ని ఏరియాల్లో సొంతంగా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. నైజాం ఏరియాకు రూ.4.5 కోట్లు.. సీడెడ్లో రూ.2 కోట్లు.. ఉత్తరాంధ్రలో రూ.1.6 కోట్లు ఆంధ్రాలోని మిగతా అన్ని ఏరియాలకూ కలిపి రూ.5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఆంధ్రా-తెలంగాణకు కలిపి రూ.13 కోట్లకు పైనే థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఇండియాలో మిగతా రాష్ట్రాలన్నీ కలిపి రూ.2 కోట్లకు బిజినెస్ జరగ్గా.. ఓవర్సీస్ హక్కుల ద్వారా రూ.2.7 కోట్ల దాకా సమకూరాయి. మొత్తంగా రూ.18 కోట్ల దాకా బిజినెస్ చేసింది ‘గీత గోవిందం’. ఇక శాటిలైట్.. డిజిటల్ హక్కుల రూపంలోనూ ఈ చిత్రం బాగానే డబ్బులు తెచ్చి పెట్టే అవకాశముంది. విజయ్ దేవరకొండ కెరీర్లో ఇది హైయెస్ట్ బిజినెస్ చేసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాకు ఉన్న హైప్ ప్రకారం చూస్తే.. పాజిటివ్ టాక్ వచ్చిందంటే వారం తిరక్కుండానే బయ్యర్లు లాభాల బాటలోకి వెళ్లే అవకాశముంది.