Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డి వల్ల ఫోన్ ఫార్మాటైంది

By:  Tupaki Desk   |   17 Sept 2017 11:29 AM
అర్జున్ రెడ్డి వల్ల ఫోన్ ఫార్మాటైంది
X
ఒక్క ఛాన్స్ అనే పదం సినిమా ఇండస్ట్రీలో తప్పా ఇంకెక్కడా ఎక్కువగా వినిపించదేమో.. తెరపై కనిపించాలని అవకాశం కోసం ఎదురు చూసే మనుషుల ఆశలు అన్ని ఇన్ని కావు. బాధలను అవమానాలను దాటుకుంటూ.. అవకాశం వచ్చినపుడు వారి ప్రతిభను చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తారు. చిన్న పాత్ర అయినా సరే మొదట తమను తాము నిరూపించుకొని ఆ తర్వాత అసలు నటన ప్రతాపాన్ని చూపిస్తారు.

ఇదే తరహాలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని కష్టపడి హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. వ్యక్తిగత జీవితంలో అంతగా కష్టాలు ఏమి లేవు కానీ నటన మీద మక్కువతో కష్టం రుచిని చూశాడు. ఎలాగైనా తన టాలెంట్ ని నిరూపించుకోవాలని అవకాశాల కోసం అనేక దారులను వెతికడు. చివరికి శేఖర్ కమ్ముల "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" సినిమాలో చిన్న ఆవకాశం దొరికింది. ఆ తర్వాత ఏడాదిన్నర వరకు ఒక్క అవకాశం కూడా రాలేదు. కానీ తన అసలు నటనను గుర్తించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మొదటి సినిమా "ఎవడే సుబ్రహ్మణ్యం" లో మంచి క్యారెక్టర్ ఇచ్చి అతడి టాలెంట్ ని నిరూపించాడు. ఆ పాత్రకు మంచి పేరొచ్చింది. అందరూ ఫోన్లు చేస్తారు అనుకున్నాడు కానీ ఒక్కరు కూడా ఫోన్ చెయ్యలేదు. అప్పుడప్పుడు ఎవరో ఒకరు ఫోన్ చేసేవారు. అలానే "పెళ్లి చూపులు - అర్జున్ రెడ్డి" కథలు విన్నాడు. పెళ్లి చూపులు తర్వాత సోలో హీరోగా చేస్తే ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందో అప్పుడు తెలిసొచ్చింది విజయ్ కి.

ఇక అర్జున్ రెడ్డి తర్వాత అసలు మనోడికి గ్యాప్ లేకుండా మెస్సేజెస్ - మిస్డ్‌ కాల్సూ ట్వీట్లతో 6 జిబి ర్యామ్ కెపాసిటీ గల ఫోన్ హ్యాంగ్ అయిపోయింది. కనీసం యూజ్ చేయడానికి కూడా వీలు లేకుండా స్పీడ్ ఫోన్ స్లో అయిపోయింది. చివరికి ఫోన్ ఫార్మాట్ చేస్తే గాని పనిచెయ్యలేదట. అంటే విజయ్ రేంజ్ ఏ స్థాయికి పెరిగిందో ఆ ఒక్క ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ముందు ముందు ఆ ఫోన్ పరిస్ధితి ఇలానే ఉండాలంటే విజయ్ కూడా ప్రేక్షకులకు ప్రతి సినిమాతో వెరైటీగా దర్శనం ఇవ్వాల్సిందే..