Begin typing your search above and press return to search.
వాట్ ద ఎఫ్.. ఏం ఆఫరిచ్చినవ్ అన్న!
By: Tupaki Desk | 31 July 2018 4:31 AM GMTఅదేంటో కొంతమంది అరిచి గీపెట్టినా సినిమాకు పబ్లిసిటీ రాదు.. కానీ టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఏం చేసినా సరే అతని సినిమాకు జస్ట్.. అలా పబ్లిసిటీ వస్తుంది. మరి విజయ్ ప్లాన్ చేస్తే అలా జరుగుతుందో లేదా పబ్లిసిటీనే విజయ్ ని వెతుక్కుంటూ వస్తుందో తెలీదు గానీ విజయ్ కి చుట్టూ ప్రస్తుతం పబ్లిసిటీ వై ఫై లా ఉంది.
విజయ్ తాజా చిత్రం 'గీత గోవిందం' త్వరలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమాలో సెకండ్ లిరికల్ సాంగ్ 'వాట్ ద ఎఫ్' ను రిలీజ్ చేయడం - ఆ పాట సాహిత్యంపై వివాదం రేగడం - ఆ తర్వాత 'గీత గోవిందం' టీమ్ దాన్ని యూట్యూబ్ నుండి తొలగించడం అన్నీ తెలిసిన విషయాలే. రీసెంట్ గా జరిగిన 'గీత గోవిందం' ఆడియో ఫంక్షన్ లో ఈ పాట గురించి మాట్లాడుతూ తన సింగింగ్ ని - లిరిక్స్ ని ట్రోల్ చేశారని ఒప్పుకుంటూ తనమీద తనే జోకులేసుకోవడం అందరినీ సర్ ప్రైజ్ చేసింది.
అదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు ట్విట్టర్ ద్వారా ఆడియన్స్ కు ఓ సూపర్ ఆఫర్ ఇచ్చాడు. వాట్ ద ఎఫ్ సాంగ్ తో ఓ కొత్త సింగర్ ను టాలీవుడ్ కి పరిచయం చేస్తాడట. 'వాట్ ద ఎఫ్' సాంగ్ తాజా లిరిక్స్ ను పోస్ట్ చేస్తూ ఈ పాటను పాడి పంపమన్నాడు. అందుకోసం కరవోకే వెర్షన్ ను ఇచ్చాడు. తమకు అందిన వాటిలో సూటబుల్ వాయిస్ ను గీత గోవిందం టీమ్ సెలెక్ట్ చేస్తుందని - దాన్నే సినిమాలో ఉంచుతామన్నాడు. అంతే కాదు.. ఆ విన్నర్ కు ఓ ఐ ఫోన్ ను గిఫ్ట్ గా ఇస్తారట. సో.. అన్న మస్తు ఆఫర్ ఇచ్చిండు.. సింగర్ ను లాంచ్ జేస్తుండు.. వై వెయిట్?