Begin typing your search above and press return to search.
సమంత కారణంగా విజయ్ మరో ప్లాన్
By: Tupaki Desk | 31 Oct 2022 12:30 AM GMTబ్యూటిఫుల్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆమె గతంలోని ట్రీట్మెంట్ కోసం పలు దేశాలకు వెళ్ళింది. బహుశా ఏదైనా సర్జరీ కోసం వెళ్లి ఉండవచ్చు అని కూడా కథనాలు చాలానే వచ్చాయి. కానీ ఇంతకాలం సమంత ఆ విషయాన్నీ ఎక్కడ చెప్పింది లేదు. కానీ మొదటిసారి ఆమె యశోద సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను కొనసాగిస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు విషయం తెలిసింది.
ఇక సమంత ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం యశోద సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా సమంత అనారోగ్యం వలన పూర్తి చేయాల్సిన ఖుషి ప్రాజెక్ట్ హోల్డ్ లో పడే అవకాశం అయితే ఉంది. ఈ ప్రాజెక్టును డిసెంబర్లోనే విడుదల చేయాలని అనుకున్నారు.
కానీ ఇప్పుడు సమంత ఆరోగ్య విషయం తెలిసిన తర్వాత మళ్లీ అనుకున్న సమయానికి సినిమా విడుదలవుతుందా లేదా అనేది కాస్త సందేహంగా మారింది. దానికి తోడు విజయ్ దేవరకొండ ఇప్పుడు మళ్లీ గ్యాప్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ గ్యాప్ లోనే విజయ్ సమయాన్ని వృధా చేయకుండా మరొక ప్రాజెక్టును మొదలుపెట్టాలని అనుకుంటున్నాడు. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ ఐనిమాను దిల్ రాజు నిర్మించబోతున్నాడు. అయితే సమంత కోలుకునే లోపు ఈ సినిమా ప్రాజెక్టుకు సంబంధించిన ఒక షెడ్యూల్ ని కూడా ఫీనిష్ చేయాలని అనుకుంటున్నారు. ఇక మళ్ళీ సమంత కోలుకున్న తర్వాత ఒకవైపు ఖుషి సినిమా షూటింగ్ చేస్తూనే మరొకవైపు ఈ ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని విజయ్ ప్లాన్ చేస్తున్నాడు.
దాదాపు ఖుషి సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు అన్నీ కూడా పూర్తయ్యాయి. సమంతతో మరో ఎపిసోడ్ మాత్రమే మిగిలి ఉంది. ఇక దాన్ని పూర్తి చేస్తే విజయ్ దేవరకొండ ఖుషి సినిమాకు గుమ్మడికాయ కొట్టేసినట్లే. ఇక ఈ గ్యాప్ లోనే గౌతమ్ ప్రాజెక్టును కూడా మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ తరువాత ఆ ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని విజయ్ ప్రణాళికలు రచిస్తున్నారు.