Begin typing your search above and press return to search.
చరణ్ మిస్ చేసిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇప్పుడు రౌడీ స్టార్..!
By: Tupaki Desk | 13 Nov 2022 11:04 AM GMTరామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత వెంటనే జెర్సీ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామా సినిమాను చేయబోతున్నట్లుగా నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ సినిమా క్యాన్సిల్ అయినట్లే అంటూ ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఒక పాన్ ఇండియా సినిమా రూపొందబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చరణ్ తో అనుకున్న కథనే దిల్ రాజు ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నిర్మించబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
రామ్ చరణ్ డేట్లు సర్దుబాటు చేయలేక పోవడంతో దర్శకుడ గౌతమ్ తిన్ననూరి తన సినిమాను విజయ్ దేవరకొండ తో చేసేందుకు సిద్ధం అయ్యాడు. అయితే యూవీ క్రియేషన్స్ వారితో కలిసి రెడీ చేసిన స్క్రిప్ట్ ను ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ చేస్తున్నాడా అనే విషయంలో చాలా రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి.
విజయ్ దేవరకొండ తో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా నిజమే కానీ అది రామ్ చరణ్ కోసం రెడీ చేసిన కథ కాదు అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు అనుకుంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఆ గౌతమ్ తిన్ననూరికే తెలియాల్సి ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన హిందీ జెర్సీ సినిమా నిరాశ పర్చినా కూడా మంచి పేరును మాత్రం దక్కించుకుంది. అందుకే ఈ సినిమా తో కచ్చితంగా కమర్షియల్ గా కూడా హిందీ ప్రేక్షకులను అలరించే విధంగా గౌతమ్ కథ ను సిద్దం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే దిల్ రాజు కాంపౌండ్ నుండి ఈ పాన్ ఇండియా మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఖుషి సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయ్ గత చిత్రం లైగర్ తీవ్రంగా నిరాశ పర్చింది. పాన్ ఇండియా స్థాయిలో లైగర్ తో బొక్క బోర్లా పడ్డ విజయ్ దేవరకొండకు అర్జంట్ గా ఒక సక్సెస్ దక్కాలి. అది ఎవరు ఇవ్వబోతున్నారు అనేది చూడాలి.