Begin typing your search above and press return to search.
ఆరు సినిమాలు.. రేటు పెంచడం కామన్
By: Tupaki Desk | 27 Nov 2016 4:41 AM GMTఎవడే సుబ్రమణ్యం మూవీలో నానితో కలిసి నటించినా.. తనదైన నటనతో తన మార్క్ చూపించాడు విజయ్ దేవరకొండ. రీసెంట్ గా పెళ్లిచూపులు మూవీతో తిరుగులేని విజయాన్ని సాధించి.. టాలీవుడ్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. హీరోగా అకౌంట్ లో ఒకే ఉన్న ఈ కుర్రాడు.. ఏకంగా అరడజన్ సినిమాల్లో నటించేస్తున్నాడు.
'అర్జున్ రెడ్డి.. ద్వారక సినిమాలు త్వరలో రిలీజ్ కానున్నాయి. ద్వారకలో విగ్రహాలు ఎత్తుకెళ్లే ఓ దొంగబాబాగా కనిపిస్తా. వంశీప్రమోద్-బన్నీవాసు-మారుతి ముగ్గరూ కలిసి రాహుల్ సంకీర్త్యన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా తీయనున్నారు. ఇది సూపర్ నేచురల్ పవర్స్ పై సాగే సినిమా కాగా.. డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభం కానుంది. దర్శకురాలు నందినీ రెడ్డితో.. ఓ రొమాంటిక్ కామెడీకి సైన్ చేశా. ఇది ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది' అని చెప్పిన విజయ్ దేవరకొండ మరో రెండు సినిమాలకు కూడా సైన్ చేశానని అంటున్నాడు.
'పెళ్లిచూపులు నిర్మాతలతో వివేక్ ఆత్రేయను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయనున్నా. భరత్ కమ్మ డైరెక్షన్ లో కూడా ఓ మూవీ యాక్సెప్ట్ చేశాను. ఇది కూడా వచ్చే ఏడాదే మొదలవుతుంది'అంటూ చెప్పకొచ్చిన విజయ్ దేవరకొండ.. కొన్ని సినిమాలు ఆడి పేరొచ్చిన తర్వాత.. రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువ కోరుకోవడం సహజమే కదా అంటూ.. రేటు పెంచిన విషయాన్ని ఇన్ డైరెక్టుగా ఒప్పేసుకున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/