Begin typing your search above and press return to search.
అనన్య పాండేతో విజయ్ దేవరకొండ హార్స్ రైడింగ్
By: Tupaki Desk | 21 Nov 2021 11:30 PM GMTవిజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ 'లైగర్' సినిమాను రూపొందిస్తున్నాడు. పూరితో పాటు కరణ్ జొహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా అనన్య పాండే పరిచయమవుతోంది. హైదరాబాద్ .. గోవా .. ముంబైలలో షూటింగు జరుపుకున్న ఈ సినిమా, ప్రస్తుతం 'లాస్ వెగాస్'లో చిత్రీకరణ జరుపుకుంటోంది. అక్కడి విశాలమైన మైదానంలో విజయ్ దేవరకొండ .. అనన్య పాండే హార్స్ రైడింగ్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను అనన్య పాండే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అక్కడి వాతావరణమైతే ఆహ్లాదకరంగా ఉంది. షూటింగుకి సంబంధించిన హడావిడి ఎక్కడా కనిపించడం లేదు. మరి ఇద్దరూ సరదాగా హార్స్ రైడింగ్ చేశారా? లేదంటే ఏదైనా సీన్ కోసమో .. సాంగ్ కోసమో ప్రాక్టీస్ చేశారా? అనేది తెలియదు. అక్కడి షెడ్యూల్ తో చాలావరకూ షూటింగు పార్టు పూర్తవుతుందట. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తారని అంటున్నారు. ఇక్కడే గుమ్మడికాయ కొట్టేస్తారని చెబుతున్నారు. నిజానికి పూరి సహజమైన శైలిలో తీసుంటే ఈ పాటికి ఈ సినిమా థియేటర్లకు వచ్చికూడా చాలా కాలమై ఉండేది.
ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా కరణ్ జొహార్ రావడం, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలను కోవడం కారణంగా పూరి కాస్త దూకుడు తగ్గించాడు. దానికి తోడు కరోనా కూడా ఆలస్యానికి కారణమైంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. బాక్సింగ్ ప్రధానంగా .. ఆ నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుంది. బాక్సింగ్ ప్రపంచానికి రారాజుగా వెలుగొందిన 'మైక్ టైసన్' ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనుండటం విశేషం. ఆయనతో ఈ సినిమా టీమ్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
విజయ్ దేవరకొండ నుంచి ఇంతకుముందు వచ్చిన 'డియర్ కామ్రేడ్' .. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలు రెండూ ప్రేక్షకులను నిరాశపరిచాయి. అందువలన ఈ సినిమా హిట్ కొట్టడం ఆయనకి చాలా అవసరం. ఆయన కూడా అలాంటి ఫలితం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే ఇతర భాషల్లో తన మార్కెట్ పెరుగుతుందనే ఆశతో ఉన్నాడు. చాక్లెట్ బోయ్ అనిపించుకున్న రామ్ తోనే మాస్ హిట్ కొట్టిన పూరి, ఇక విజయ్ దేవరకొండను ఏ రేంజ్ లో చూపిస్తాడా అనే కుతూహలంతో అభిమానులు ఉన్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా థియేటర్లలో దిగనుంది.