Begin typing your search above and press return to search.

లైవ్ లో బూతులు ఏల రాజా!!

By:  Tupaki Desk   |   8 Aug 2017 7:34 AM GMT
లైవ్ లో బూతులు ఏల రాజా!!
X
మొదటి సినిమాతోనే ప్రయోగాలు చేసి ఈ తరం హీరోలు టాలీవుడ్ లో మంచి హిట్స్ అందుకుంటున్నారు. అంతే కాకుండా ఒకే విధానంతో వెళ్లకుండా వినూత్న కథలను ఎంచుకుంటూ.. సినీ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తామని ఆఫర్లు వస్తున్నా అనవసరమైన కథలను ఒకే చేయడంలేదు. అలాంటి ఆలోచనతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న వారిలో విజయ్ దేవరకొండ ఒకరు.

"పెళ్లిచూపులు" సినిమాతో అనూహ్యవిజయాన్ని అందుకున్న ఈ యంగ్ హీరో తనదైన శైలిలో సినిమాలను తీస్తున్నాడు. అయితే తన రెండవ సినిమా "ద్వారక" అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ సారి ఎలా అయినా "అర్జున్ రెడ్డి" సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో అంచనాలను బాగానే రేపింది. ఈ చిత్రం హీరో సినిమా ప్రమోషన్స్ లో ఈ మధ్య తెగ ఆకట్టుకుంటున్నాడు. విజయ్ ఇంతకుముందు కూడా ఎక్కడ స్పీచ్ ఇచ్చినా అది సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యేది. అయితే రీసెంట్ గా అయన ఇచ్చిన ఓ సోషల్ మీడియా ఇంటర్వ్యూ మాత్రం కాస్త నెగిటివ్ గా మారింది.

ఎందుకంటే విజయ్ ఆ ఇంటర్వ్యూలో రాయడానికి కూడా వీలు లేని కొన్ని అసభ్యకర పదాలను వాడాడు. ఇంగ్లీష్ లో ఉన్న ఆ బూతులు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా పలు రకాల నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ తన అర్జున్ రెడ్డి సినిమా పాత్ర నుంచి ఇంకా బయటకి రాలేనట్లు ఉన్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ ఆరంబంలోనే ఇలాంటి మాటలు వాడటం మంచిదికాదని అంటున్నారు మరికొందరు. ఇక అర్జున్ రెడ్డి సినిమా ఈ నెల 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.