Begin typing your search above and press return to search.
తండ్రి పాత్రలో విజయ్.. వాటే క్రేజీ...!
By: Tupaki Desk | 12 Nov 2022 4:30 AM GMTసినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ ఇస్తే ఆకాశానికి ఎత్తేయడం..భారీ డిజాస్టర్ ఇస్తే పాతాళానికి తొక్కేస్తూ విమర్శలు గుప్పించడం షరా మామూలే. అదే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ విషయంలోనూ జరిగింది. `అర్జున్‌రెడ్డి మూవీతో విజయ్ దేవరకొండ గత కొన్నేళ్ల క్రితం పాథ్ బ్రేకింగ్ మూవీని, గేమ్ ఛేంజర్ ని సొంతం చేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన విషయం తెలిసిందే. 2017లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే.
ఐదు కోట్లతో రూపొందిన ఈ మూవీ ఊహకందని విధంగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ ఏకంగా రూ. 50 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ఔరా అనిపించింది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ ప్రదర్శించిన నట యావత్ ఇండియా వైడ్ గా చర్చనీయాంశంగా నిలిచి పాన్ ఇండియా లెవెల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. బాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారిన ఈ మూవీతో విజయ్ దేవరకొండ పాపులర్ అయ్యాడు.
బాలీవుడ్ లో సినిమా చేయకుండానే అక్కడి స్టార్స్ కి ఫేవరేట్ స్టార్ గా మారిపోయాడు. ఇంతటి క్రేజ్ ని `అర్జున్ రెడ్డి`తో సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోనూ సినిమాలు చేసి సంచలనాలు సృష్టించడం ఖాయం అనే వార్తలు వినిపించాయి. ఆ వార్తలని నిజం చేస్తూ బాలీవుడ్ క్రేజీ స్టార్లతో కలిసి విజయ్ దేవరకొండ కమర్షియల్ యాడ్ లు చేయడం మొదలు పెట్టారు. ఇక పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేయడమే తరువాయి అనే చర్చలు జరుగుతున్న వేళ విజయ్ దేవరకొండ `అర్జున్ రెడ్డి`కి ముందు కమిట్ అయిన సినిమాలు చేయక తప్పలేదు.
అలా గీత గోవిందం, ట్యాక్సీవాలా వంటి సినిమాల్లో నటించడంతో అవి సక్సెస్ అయినా విజయ్ రేంజ్ కి తగ్గ హిట్ లుగా నిలవలేకపోయాయి. ఆ తరువాత నుంచి అదే పంథాను అనుసరిస్తూ సినిమాలు చేశాడు విజయ్. దాంతో `అర్జున్ రెడ్డి` క్రేజ్ కాస్త ఆవిరైపోయింది. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాలే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండ క్రేజ్ మరింత తగ్గిపోయింది. ఫలితంగా రౌడీ స్టార్ టోటల్ గా ట్రాక్ తప్పేశాడు.
ఇదిలా వుంటే క్రేజ్ తగ్గిన విజయ్ దేవరకొండ పేలవమైన కథతో చేసిన `లైగర్` తన క్రేజ్ ని మరింత తగ్గించి డిజాస్టర్ ని అందించింది. దీంతో ఆకాశాన్ని తాకుతుందనుకున్న విజయ్ కెరీర్ ఊహకందని విధంగా దెబ్బతింది. ఈ దశలో విజయ్ పై రోజు కో వార్త.. నెగిటివిటీ భారీగా పెరిగిపోతూ సిల్లీ వార్తలు పుట్టుకొస్తున్నాయి. సమంత అనారోగ్య కారణాల వల్ల `ఖుషీ` షూటింగ్ ఆగిపోవడం.. `లైగర్` డిజాస్టర్ తో `జనగణమన` ని పక్కన పెట్టేయడంతో విజయ్ దేవరకొండని `బ్రహ్మాస్త్ర 2` కోసం అడుగుతున్నారనే క్రేజీ వార్తలు పుట్టుకొస్తున్నాయి.
`బ్రహ్మాస్త్ర 2`ని దేవ్ పాత్ర నేపథ్యంలో తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని పార్ట్ 1 ఎండింగ్ లో వెల్లడించిన విషయం తెలిసిందే. రణ్ బీర్ కపూర్ నటించిన శివ పాత్రకు తండ్రి గా నటించిన పాత్రే దేవ్. ఈ పాత్ర కోసం పలువురు బాలీవుడ్ నటులని సంప్రదించిన కరణ్ జోహార్ చివరికి విజయ్ దేవరకొండని సంప్రదించారని వార్తలు వినిపిస్తున్నాయి. రణ్ బీర్ పాత్రకు ఇది తండ్రి పాత్ర.. ఇలాంటి పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తాడంటే అంతకంటే సిల్లీ మరొకటి లేదు. ఇలాంటి వార్తలని ఎలా పుట్టిస్తున్నారో వాటే క్రేజీ అంటూ రౌడీ ఫ్యాన్స్ కామెంట్ లు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.